నిఖిల్‌కు కొత్త శ్వాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరో నిఖిల్ సక్సెస్ వెతుకులాట ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాడు. ఇప్పటికే అంగీకరించిన ఓ చిత్రం క్లైమాక్స్ షూటింగ్‌లో ఉండగానే కొత్త చిత్రాన్ని శుక్రవారం మొదలెట్టాడు. నివేదా థామస్‌తో జోడీ కట్టిన నిఖిల్ కొత్త చిత్రం ‘శ్వాస’. శ్రీ తేజ్ ఫిలిం ఫ్యాక్టరీ, రెడ్ స్కై ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై తేజు ఉప్పలపాటి, హరినికేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. కిషన్ కట్టా దర్శకుడు. కొత్త చిత్రం ముహూర్తపు షాట్‌కు హీరో శర్వానంద్ క్లాప్‌నిస్తే, జెమిని కిరణ్, నరేశ్‌లు కెమెరా స్విచ్చాన్ చేశారు. క్రిష్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించాడు. కొత్త చిత్రం ప్రారంభం సందర్భంగా మీడియాతో హీరో నిఖిల్ మాట్లాడుతూ స్క్రిప్ట్‌మీద మమకారంతో సినిమాకు ఒప్పుకున్నట్టు చెప్పారు. తన పాత్రలోని భిన్నమైన పార్శ్వాలు తనను అట్రాక్ట్ చేశాయని, యంగ్ డైరెక్టర్‌తో పనిచేయడం హ్యాపీగా ఉందన్నారు. కొత్తవారైన నిర్మాతలు మంచి సినిమాను తీసుకొచ్చే ప్రయత్నంలో తాను భాగమయ్యానని, నివేదా థామస్ హీరోయిన్‌గా నటిస్తోందన్నాడు. హీరోయిన్ నివేదా థామస్ మాట్లాడుతూ కళ్యాణ్‌రామ్‌తో ఇప్పటికే సినిమా చేస్తున్నానని, అదే సమయంలో ఈ మంచి స్క్రిప్ట్ తనవద్దకు రావడంతో కొత్త చిత్రాన్ని అంగీకరించానని చెప్పుకొచ్చారు. ఆడియన్స్‌కు తమను తాము తెరపై చూసుకుంటున్న భావన కలుగుతుందని చెప్పారు. దర్శకుడు కిషన్ కట్టా మాట్లాడుతూ ఈ సినిమా ఓ జర్నీ అన్న భావన కలుగుతోందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ హరినికేష్‌రెడ్డి మంచి ట్యూన్లు ఇచ్చారని, నిఖిల్‌తో సినిమా చేయడం ఎనర్జిటిక్‌గా ఉందన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ దర్శకుడు కిషన్ తమకు మంచి స్నేహితుడని వివరించారు. మంచి స్క్రిప్ట్ తమకు వినిపించడంతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాని, నిఖిల్, నివేదాలు సినిమాకు అంగీకరించినందుకు థాంక్స్ చెప్పారు. నిఖిల్‌ని మంచి ఛాలెంజింగ్ పాత్రలో చూస్తారన్నారు.