తిత్లీ బాధితులకు మా సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఐదు లక్షల చెక్‌ను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసిన అసోసియేషన్ సభ్యులు చెక్‌ను అందించారు. మంత్రిని కలిసిన వారిలో మా అధ్యక్షుడు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి వికె నరేష్, ఉపాధ్యక్షుడు బెనర్జీ, కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఏడిద శ్రీరామ్, నటుడు, నిర్మాత అశోక్‌కుమార్, నాగినీడు, సురేష్ కొండేటి ఉన్నారు.
25 లక్షలు ప్రకటించిన బన్నీ
తుపాను దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం ప్రాంతవాసుల్ని ఆదుకునేందుకు హీరో అల్లు అర్జున్ ముందుకొచ్చాడు. అభాగ్యుల కోసం 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, అభిమానులు సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అర్జున్ పిలుపునిచ్చాడు. గతంలోనూ హుదూద్ తుపాను సమయంలోనే కాకుండా, తమిళనాడు, కేరళ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినపుడూ బన్నీ ఆర్థిక సాయాన్ని అందచేయడం తెలిసిందే.