సిద్ధమైన శ్రీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ, విజయనిర్మల నటించిన ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ సాయిదీప్ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్ సిరాజులు సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘శ్రీశ్రీ’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, కృష్ణ స్వర్ణోత్సవ చిత్రంగా తాము రూపొందిస్తున్న ఈ చిత్రం ఆయన అభిమానులకు పండగలా వుంటుందని, డిసిపి పాత్రలో సుధీర్‌బాబు ఒదిగిపోతే, వాయిస్‌ఓవర్ ఇచ్చి మహేష్‌బాబు ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై మంచి టాక్‌ను పొందాయని తెలిపారు. తమ అభిమాన కథానాయకుడైన కృష్ణతో రూపొందిన ఈ చిత్రం మొదటి కాపీ వచ్చేంతవరకూ అహర్నిశలు శ్రమించామని, దర్శకుడు చెప్పినదానికన్నా వందశాతం బాగా తీశారని, కృష్ణకు ఓ అపురూపమైన చిత్రంగా మిగిలిపోతుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు అన్నారు. నరేష్, సాయికుమార్, పోసాని కృష్ణమురళి, ఎల్.బి.శ్రీరాం, తోటపల్లి మధు, దేవదాస్ కనకాల, మురళీశర్మ, కునాల్ కౌశిక్, అనితాచౌదరి, సోఫియా తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:రామ్ కంకిపాటి, కథ:రమేష్ డియో ప్రొడక్షన్స్, సంగీతం:ఇ.ఎస్.మూర్తి, కెమెరా:సతీష్ ముత్యాల, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ముప్పలనేని శివ.