ట్రైలర్‌లోనే రంగుపడింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలల్‌స్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తనీష్, పరుచూరి రవి, ప్రియాసింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, షఫీ, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘రంగు’. కార్తికేయ వి దర్శకత్వంలో ఎ పద్మనాభరెడ్డి, నల్ల అయ్యప్పనాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో సినిమా ట్రైలర్‌ను పరుచూరి వెంకటేశ్వరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో తనీష్ మాట్లాడుతూ తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా ‘రంగు’ సినిమాకు సంబంధించిన ట్రైలర్, మూడు పాటలు విడుదలయ్యాయన్నాడు. ట్రైలర్‌కు వన్ మిలియన్ వ్యూస్ వస్తే, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందన్నాడు. సినిమా విషయానికి వస్తే లారా అనే వ్యక్తి పాత్రలో తాను కనిపిస్తానని, నాలుగు వేరియేషన్స్‌లో ఆ పాత్ర సాగుతుందన్నాడు. హీరోలు, విలన్లు ఈ చిత్రంలో ప్రత్యేకంగా ఉండరని, పరిస్థితుల ప్రభావమే ఆ వేరియేషన్స్‌లో కనిపిస్తుందన్నాడు. సోషల్ మెసేజ్ వున్న చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆలోచింపజేస్తుందని అన్నాడు. దర్శకుడు కార్తికేయ వి మాట్లాడుతూ ‘న్యూస్‌పేపర్‌లో ఓ కథనాన్ని చదివి ఆ ఆలోచనతో విజయవాడ వెళ్లాను. అక్కడ లారా అనే వ్యక్తి విషయాలను సేకరించి, దానినుంచి కథను తయారు చేసుకున్నా’ అన్నాడు. కథను రియలిస్టిక్‌గా చూపిస్తూనే కమర్షియల్ పంథాలో ఉండేలా పరుచూరి బ్రదర్స్ సహాయ సహకారాలు అందించారన్నాడు. తనీష్ చిన్న కుర్రాడి నుంచి ఇరవై ఎనిమిదేళ్ళ యువకుడిగా కనపడే పాత్ర కోసం కష్టపడ్డామని, ఆ కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుందన్నారు. యోగేశ్వర్ శర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారని, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. నిర్మాత ఎ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ మా బ్యానర్‌లో 7 సినిమాలు అండర్ ప్రొడక్షన్‌లో ఉండగా, 40మంది దర్శకులతో మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. రంగు చిత్రం ద్వారా మంచి ప్రయత్నం చేశాం. సమాజంలో యువత ఎలా బాధ్యతతో ఉండాలి, సమాజాన్ని కాపాడాల్సిన పోలీసుల బాధ్యత ఏమిటి? ఇలా చాలా అంశాలను సినిమాలో చూపిస్తున్నాం. తప్పకుండా మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.