1న 7 టు 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్ బచ్చు, రాజ్‌బాల, రాధిక, లౌక్య, పప్పుశ్రీనివాస్ ప్రధాన తారాగణంగా విజయశేఖర్ సంక్రాంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘7 టు 4’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయశేఖర్ మాట్లాడుతూ, ఒకే ఒక రాత్రిలో జరిగే పలు ఆసక్తికర సంఘటనలతో థ్రిల్లింగ్ నేరేషన్‌తో సాగే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, ఆడియోను విడుదల చేశామని అన్నారు. ట్రైలర్లకు, ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, ‘7 టు 4’ పేరుతో తెరకెక్కిన ఈ థ్రిల్లింగ్ చిత్రంలో సోషల్ మెసేజ్ కూడా వుందని తెలిపారు. హారర్ థ్రిల్లర్ కథాంశాలకు మంచి క్రేజ్ వున్న ఇప్పుడు ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందని, అన్ని రకాల ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 1న విడుదలకు ముస్తాబు అవుతోందని వారు తెలిపారు. శ్రీకాంత్, ప్రవీణ్, నివాస్, భరత్, కిరణ్, నితేష్, కార్తీక్, అనూప్, వెనె్నల, దివ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:ద్విభాష్యం శ్రీలక్ష్మీ వందన, సంగీతం:స్నేహలత మురళి, కెమెరా:ప్రభాత్.ఇ.కె., ఎడిటింగ్:సత్య గిడుతూరు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం:విజయశేఖర్ సంక్రాంతి.