అజరామరం.. ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. నంది క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు కె.ఎం.డి.రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాణంలో కోటేంద్ర దుద్యాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కరోణ్య కత్రిన్ హీరోయిన్. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 25న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో రాఘవ్ మీడియాతో ముచ్చటించిన విశేషాలు..
మాది కర్నూలు. నేను ఎంఎస్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నా. ప్రస్తుతం బెంగుళూరులో జాబ్ చేస్తున్నాను. ఈ సినిమా కోసం హీరోగా నన్ను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. నిజానికి నేను సినిమాలో హీరో అవుతానని అనుకోలేదు. నాకు నటన గురించి అసలు తెలియదు. కానీ ఈ సినిమా దర్శకుడు ఈ పాత్రకు బాగా సూట్ అవుతానని నన్ను ఈ పాత్రకు ఎంపిక చేశాడు. దర్శకుడు కోటేంద్ర ప్రతి విషయంలో ఎంతో సపోర్టు ఇచ్చి నన్ను నటుడిగా తీర్చిదిద్దాడు. ఇక ఈ సినిమాలో నా పాత్ర గురించి చెప్పాలంటే అమ్మ స్కూల్ టీచర్.. నేను గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతుంటా. అలా సాఫీగా సాగిపోతున్న నా జీవితంలోకి మా ఊరు ప్రెసిడెంట్ కూతురు ఎంట్రీ ఇస్తే.. ఆ తరువాత మా ప్రేమ ఎలా పుట్టింది.. ఆ ప్రేమవల్ల జరిగిన పర్యవసానాలు ఏమిటి అన్నది ఈ కథ. రాయలసీమలో జరిగిన ఒక యధార్థ పరువు హత్య నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఈమధ్య పరువుకోసం తల్లిదండ్రులు ఎంతటి దారుణానికైనా వెనుకాడడం లేదు. కానీ ప్రేమలో వున్న గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే జీవితాలు అందంగా ఉంటాయి. మంచి కథ.. సెంటిమెంట్, యాక్షన్ అన్ని అంశాలు ఉంటాయి. ప్రేమ, పరువు హత్యలతోపాటు తల్లీ కొడుకుల సెంటిమెంట్, ఎమోషన్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు సంగీతం అందించిన ఆరు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాతలు ఇచ్చిన సహకారం మరువలేనిది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు.