షేడ్ ఆఫ్ సాహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి ఇంకా వెంటాడుతున్నాడు. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన రాజుల కథను రెండక్షరాల టైటిల్‌తో మస్తిష్కానికి మళ్లీ గుర్తు చేస్తున్నాడు. -మాహిష్మతి సామ్రాజ్య ప్రజలు ఏ పేరుతో వీరుడిని కీర్తించారో ఆ పేరే ప్రభాస్ తరువాతి ప్రాజెక్టు టైటిల్ అన్నది తెలిసిందే. అదే -సాహో. బాహుబలి హిట్టు సాంగ్ కోరస్‌లోని తొలి అక్షరాలివి. మూడు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తెలగు చిత్రం ‘సాహో’. రన్ రాజా రన్ మూవీతో సూపర్‌హిట్ అందుకున్న సుజీత్ ఈ చిత్రానికి దర్శకుడు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగావున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న సాహో లుక్‌ను మంగళవారం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో’గా విడుదల చేశారు. గతంలో బాహుబలి కంక్లూజన్ ఫస్ట్‌లుక్‌ని సైతం రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగానే విడుదల చేయడం జరిగింది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మరోసారి ఈ షేడ్స్ ఆఫ్ సాహోలోని తొలి షేడ్‌ని ఫ్యాన్స్‌కి బర్త్‌డే ట్రీట్ ఇచ్చాడు ప్రభాస్. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్కీ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాహోని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజీత్‌తోపాటు హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారు. సాహోలో ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఫిమేల్ లీడ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ మూడు భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా మా బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం సాహో. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్’ని విడుదల చేశామన్నారు. ఇటలీలో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, దాదాపు 60 శాతం షూటింగ్ పూరె్తైనట్టు వివరించారు.