వినీత్ పిడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి2 ఫిల్మ్స్ ప్రై. లి. పతాకంపై రాంమోహన్.సిహెచ్. దర్శకత్వంలో అశోక్ గోటి రూపొందించిన చిత్రం ‘పిడుగు’. వినీత్, మోనికా సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్, పాటలకు మంచి స్పందన వస్తోందని, హీరోగా పరిచయమైన వినీత్ కమర్షియల్ హీరోగా రాణిస్తాడని తెలిపారు. ఐదు ఫైట్స్‌తో ఫస్ట్ఫా అంతా లవ్‌ట్రాక్‌తో, సెకెండాఫ్ అంతా యాక్షన్ పార్ట్‌తో సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. ఏప్రిల్ 1న రానున్న ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందిందని అన్నారు. వినోద్‌కుమార్, బెనర్జి, అనంత్, ఫణి, ముక్తార్‌ఖాన్, ప్రియాంక, సంధ్యాజనక్, ప్రభావతి, జూ.రేలంగి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:రమేష్ రాయ్, పాటలు:్భస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, వరికుప్పుల యాదగిరి, సంగీతం:కార్తీక్, విజయ్ కూరాకుల, కెమెరా:వి.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్:కార్తిక శ్రీనివాస్, నిర్మాత:అశోక్ గోటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రాంమోహన్.సిహెచ్.