వచ్చే 16న హుషారుగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ ‘మేము వయసుకు వచ్చాం’, ‘సినిమా చూపిస్తమావ’లాంటి సూపర్‌హిట్లు తీశారు. ఈ సంస్థలో 9వ చిత్రంగా ‘హుషారు’గా తీస్తున్నారు. రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, దక్ష నాగర్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణం. ‘అర్జున్‌రెడ్డి’తో పాపులరైన సంగీత దర్శకుడు రథన్, ఛాయాగ్రాహకుడు రాజ్‌తోట ఈ చిత్రానికి పని చేసారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని నవంబర్ 16న విడుదలకి సిదమైంది. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ మా బ్యానర్‌ని నెక్స్ట్‌లెవెల్‌కి తీసుకెళ్లే సినిమా ఇది. కథా కథనాలు ఇన్నోవేటివ్‌గా, ట్రెండీగా ఉంటాయి. దర్శకుడు శ్రీహర్ష ఎక్స్‌లెంట్‌గా తెరకెక్కించాడు. షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ తుది దశలో ఉంది. నవంబర్ 16న విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా విడుదల చేసిన లిరికల్ వీడియో సాంగ్‌కి విశేష ఆదరణ లభిస్తోంది. దీంతోపాటు అన్ని థియేటర్స్‌లో థియేట్రికల్ ట్రైలర్‌కి కూడా ప్రేక్షకులనుండి ఆదరణ లభిస్తోంది’ అన్నారు.