కన్నడపై ఆకాంక్ష..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్లీరావా చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది టీవీ నటి ఆకాంక్షాసింగ్. ఈ చిత్రంలో సుమంత్‌తో కలిసి నటించింది. సినిమా కూడా మంచి విజయం సాధించినా కానీ ఎక్కువగా అవకాశాలను రాబట్టుకోలేకపోయింది. ఇక ఈ చిత్రం తరువాత కింగ్ నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్ దేవదాస్ చిత్రంలో నాగ్‌కి జోడీగా నటించింది. ఇటీవల విడుదలైన సినిమా యావరేజ్ అనిపించింది. ఇక ఇపుడు ఆకాంక్షసింగ్ కన్నడలోకి ఎంట్రీ ఇస్తోంది. స్టార్ హీరో కిచ్చా సుధీప్ నటిస్తున్న పహిల్వాన్ అనే చిత్రంలో జోడీగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె రెండు షేడ్స్ వున్న పాత్రలో కనిపించనుందట. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.