ప్లీజ్.. పర్సనల్స్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనరల్‌గా సినిమావాళ్ళ జీవితాలు అంటే పబ్లిక్ ప్రాపర్టీ లాంటివి. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఎలాంటి దాపరికాలు ఉండవు. ఒకవేళ దాపరికం మెయిన్‌టైన్ చేయాలన్న ఏదో ఓ సందర్భంగా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఈ విషయంలో గ్లామర్ భామ శ్రీయ మాత్రం సీరియస్‌గా ఉంది. ప్రొఫెషన్ లైఫ్ గురించి ఏదైనా మాట్లాడండి.. కానీ పర్సన్ లైఫ్ గురించి మీకు అవసరంలేదని కాస్త గట్టిగానే చెప్పింది. ఈమధ్యే శ్రీయ రష్యన్ బిజినెస్‌మెన్‌ని వివాహం చేసుకున్న తరువాత ఆమె పెళ్ళికి సంబంధించిన వ్యవహారాలు కానీ అతగాడి గురించి వివరాలు కానీ బయటపెట్టలేదు. తాజాగా శ్రీయ వీరభోగ వసంతరాయలు సినిమాలో నటిస్తున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీరు పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి అని అడిగిన యాంకర్‌కు అదిరిపోయే సమాధానం ఇచ్చింది శ్రీయ. మా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు. మా పర్సనల్ జీవితాలను అమ్ముకోవడానికి సిద్ధంగా లేము. ప్రొఫెషన్ గురించి అడగండి చెబుతా! అంటూ గట్టిగానే చెప్పడంతో సదరు యాంకర్ అవాక్కయింది! శ్రీయ ఎందుకు పర్సనల్ లైఫ్ గురించి చెప్పడం లేదన్న విషయంపై పలు రకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.