వినయ విధేయ రామే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి టైటిల్ దాదాపు కన్ఫ్‌ర్మ్ అయినట్టే. ఇప్పటికే జగదేకవీరుడు, ముఠామేస్ర్తీ, రౌడీ తమ్ముడు లాంటి టైటిల్స్ వినిపించాయి.. తాజాగా వినయ విధేయ రామ అనే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు హీరో, దర్శకులు. ఈ నేపథ్యంలో వినయ విధేయ రామ టైటిల్‌పై యూనిట్ ఆసక్తిగా ఉన్నారట. అటు రామ్‌చరణ్ కూడా టైటిల్స్‌పై ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ముగ్గురు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఇక యాక్షన్ విషయంలో బోయపాటి స్టైల్ వేరు. యాక్షన్‌ని తెరపై అద్భుతంగా ప్రెజెంట్ చేయగల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్నాడు కాబట్టి.. ఈ సినిమాలో చరణ్ చేసే యాక్షన్ ఓ రేంజ్‌లో ఉంటుందని.. మెగా ఫ్యాన్స్‌కు ఇక పండగే అని ఫిలిం వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తాజాగా రామ్‌చరణ్ వినయ విధేయ రామ టైటిల్ బాగుందని ఓకె చేయడంతో దర్శకుడు బోయపాటి ఆ టైటిల్ డిజైన్ చేయించే పనిలో ఉన్నాడట. ఇటీవలే వైజాగ్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏకధాటిగా షూటింగ్ జరుపుతున్నారు. దీపావళి సందర్భంగా టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తారట.