షాహిద్.. కబీర్‌సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసింది అర్జున్ రెడ్డి చిత్రం. అటు తమిళంలోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ పాత్రను షాహిద్‌కపూర్ పోషిస్తున్నాడు. అతనితో కైరా అద్వానీ జోడీ కడుతోంది. హిందీ చిత్రానికీ సందీప్ వంగా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. షాహిద్‌కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈమధ్యే మొదలైంది. ఆ పాత్ర కోసం షాహిద్‌కపూర్ కూడా బాగా మారిపోయాడు. తాజాగా షాహిద్ ఫోటోని దర్శకుడు సందీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. హిందీ అర్జున్‌రెడ్డి ఇలా ఉంటాడు అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం షాహిద్ న్యూలుక్ బి టౌన్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. తాజాగా ‘కబీర్‌సింగ్’ టైటిల్‌ను ఖరారు చేస్తూ టైటిల్ పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. పోస్టర్‌లో పిడికిలి బిగించిన చేతిలోనే ఒకవైపు చేతి వేళ్లు, మరోవైపు హృదయాకారం ఉండడం ఆసక్తికరం. టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, మురాద్ ఖేతాని, క్రిషన్ కుమార్, అశ్విన్ వర్దే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే జూన్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఇక తమిళ రీమేక్‌ను ‘వర్మ’ టైటిల్‌తో ప్రముఖ నటుడు విక్రమ్ కుమారుడు ధృవ్ చేస్తుంటే, బాలా దర్శకత్వం వహిస్తున్నాడు. రీమేక్‌లు ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.