సారీ.. చెప్పను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ హీరో అర్జున్‌పై లైంగిక అభియోగాలు చేసిన నటి శ్రుతిహరణ్ తన మాటకు కట్టుబడే ఉంటానంటోంది. తనపై అభియోగాలు మోపిన శ్రుతిపై ఇప్పటికే హీరో అర్జున్ దావా వేశారు. ‘నిబునన్’ షూటింగ్ టైంలో అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడన్నది శ్రుతి అభియోగం. కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమల్లో చర్చకు తెరలేపిన శ్రుతి వ్యాఖ్యలను కొందరు తప్పుబడితే, మరికొందరు మద్దతుగా నిలిచారు. పరిస్థితి ముదురుతుండటంతో, అర్జున్, శ్రుతిహరణ్‌లతో కర్ణాటక ఫిలిం ఛాంబర్ తాజాగా సమావేశం నిర్వహించింది. అయితే సమావేశానికి కొన్ని గంటల ముందే బెంగుళూరు సివిల్ కోర్టులో శ్రుతిపై అర్జున్ రూ.5 కోట్ల దావా వేశాడు. సమస్య పరిష్కారానికి ఛాంబర్ అధ్యక్షుడు అంబరీశ్, ఇతర సభ్యులు ప్రయత్నించారు. శ్రుతి తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అర్జున్ డిమాండ్ చేస్తే, ‘నా అభియోగాలకు కట్టుబడి ఉన్నా. నా మనసుకు ఏది సరైనదనిపిస్తే దానికోసమే పోరాడతాను. క్షమాపణలు చెప్పేది లేదు’ అంటూ భీష్మించింది. రసవత్తరంగా మారిన వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.