వీడే ‘రోషగాడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన కథలతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పుడు రోషగాడుతో పోలీస్ పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యాడు విజయ్. విజయ్‌తో నివేదా పేతురాజ్ జోడీ కట్టిన చిత్రానికి గణేశా దర్శకుడు. తాజాగా ‘రోషగాడు’ టీజర్‌ను విడుదల చేసి అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. పోలీసులను తక్కువచేసి మాట్లాడేవాళ్లను ఉద్దేశించి విజయ్ చెప్పే పవర్ డైలాగులతో టీజర్ ఆకట్టుకుంటోంది. ‘రాత్రిపూట హాయిగా ఫ్యానేసుకుని నిద్రపోతుంటే మేము కుక్కల్లా రోడ్లపై కాపలా కాస్తుంటాం కదా. పుడింగిలమే. నీ తాగుబోతు మొగుడు రోడ్డుపైపడి చావకూడదని పైపుపెట్టి చెక్‌చేసి జాగ్రత్తగా ఇంటికి పంపుతున్నాం కదా.. మేం పుడింగిలమే’ అన్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ స్టయిల్‌తో వస్తోన్న కథే ‘రోషగాడు’. విజయ్ సొంత ప్రొడక్షన్‌పై ఫాతిమా విజయ్ నిర్మిస్తోన్న చిత్రమిది.