రూల్ పాటలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్ పతాకంపై శివ, సోనాపటేల్ హీరో హీరోయిన్లుగా పైడి రమేష్ దర్శకత్వంలో పైడి సూర్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం రూల్ (ది పవర్ ఆఫ్ పీపుల్స్). నవంబర్ 9న విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఆడియో బిగ్ సీడీని ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేశారు. సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు మోషన్ పోస్టర్‌ని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఫస్ట్‌లుక్‌ను, ప్రొడ్యూసర్ అశ్వినీదత్ టీజర్‌ను, డైరెక్టర్ బోయపాటి శ్రీను ట్రైలర్‌ను లాంచ్ చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ రూల్ (ది పవర్ ఆఫ్ పీపుల్) ప్రమోషన్స్‌లో ఇంతమంది సినీ రాజకీయ ప్రముఖులు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. యువజన నాయకుడైన హీరో తన కుటుంబంతోపాటు ఎన్నో కుటుంబాలను అన్యాయాల బారిన పడకుండా ఆదుకుని ఎలా ఆదర్శవంతుడయ్యాడన్నదే కథ. చిత్రంలో నాలుగు పాటలున్నాయని, రమణ సాయిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశామన్నారు. నిర్మాత మాట్లాడుతూ ఆవేశం కంటే ఆలోచనలు ముఖ్యమనీ, మనీ కంటే మనుషుల విలువలు ముఖ్యమనీ తెలియజేసే మంచి మెసేజ్ చిత్రాన్ని నిర్మించానన్నారు. ఈనెలలో సెన్సార్ పూర్తి చేసి నవంబర్ 9న సినిమాను విడుదల చేస్తామన్నారు. ఇంకా చిత్రంలో మురళీధర్‌గౌడ్, కృష్ణమోహన్‌గౌడ్, ఆదికేశవుల నాయుడు, తనూజ తదితరులు నటిస్తున్నారు.