వెరైటీ శుభలేఖ+లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కాలంలో ఓ ప్రత్యేకమైన అటెన్షన్ రప్పించుకున్న చిత్రం ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోను, ఇటు మార్కెట్‌లోను క్యూరియాసిటీ సొంతం చేసుకుంది. తారలు, దర్శకుడు, నిర్మాతలు అంతా కొత్తవారే కావటం విశేషం. దర్శకుడిగా శరత్ నర్వాడే పరిచయమవుతున్న చిత్రాన్ని సి.విద్యాసాగర్, జనార్ధన్ ఆర్.ఆర్. నిర్మించారు. శ్రీనివాస్ సాయి, దీక్ష శర్మరైనా హీరో హీరోయిన్లు. ప్రియా వడ్లమాని లీడ్ క్యారెక్టర్ చేసారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న చిత్రం హక్కులను నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి ఫ్యాన్సీ ఆఫర్‌తో సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈమధ్య కాలంలో ఇలాంటి ఫీల్‌గుడ్ సినిమా రాలేదు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. అటు యూత్, ఇటు ఫ్యామిలీస్ అందరికీ ఈ మూవీ నచ్చుతుందనే నమ్మకముంది అన్నారు. నిర్మాతలు సి.విద్యాసాగర్, జనార్ధన్ ఆర్.ఆర్. మాట్లాడుతూ ‘సినిమాల్లో కొత్తదనాన్ని ఆడియన్స్ ఆస్వాదిస్తున్నారు. అలాంటి జాబితాలో ఈ సినిమా కూడా ఉంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని తెలిపారు.