సక్సెస్ దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చి వౌత్ టాక్‌తో సక్సెస్‌ను అందుకున్న బంగారి బాలరాజు టీం ఆనందం వ్యక్తం చేసింది. దీపావళికి ముందే విజయం దక్కడంతో హైదరాబాద్‌లో కేక్ కట్‌చేసి, బాణాసంచాని కాల్చి ముందుగానే దీపావళి జరుపుకున్నారు. రాయలసీమలో పరువు హత్యల నేపథ్యంలో యధార్థ ప్రేమకథతో వచ్చిన బంగారి బాలరాజు విజయానందాన్ని మీడియాతో దర్శకుడు కోటేంద్ర దుద్యాల పంచుకున్నారు. సినిమా విజయానికి కారకులైన ఆడియన్స్, మీడియాకు ధన్యవాదాలు తెలుపుతూ, నేనూ మీడియావాడినే. దర్శకుడిగా సక్సెస్ అవ్వడానికి కారణమైన నిర్మాతలు, చిత్ర యూనిట్‌కి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.
హీరో రాఘవ్ మాట్లాడుతూ మొదటి సినిమానే మంచి విజయం అందుకోవడం ఆనందంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కోటేంద్రకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా మంచి టాక్ సంపాదించడం ఆనందంగా ఉందన్నారు. కొంతమంది శ్రేయోభిలాషులు రిస్క్ ఎందుకని వారించినపుడు కొంత ఆందోళనకు గురయ్యామని, కానీ కథ, దర్శకుడి మీద నమ్మకంతో 113 థియేటర్లలో బంగారి బాలరాజును విడుదల చేశామన్నారు. ఇప్పుడు మంచి వౌత్ టాక్‌తో యూనిట్‌కు ముందుగానే దీపావళి వచ్చిందన్నారు. మరిన్ని థియేటర్లు పెంచేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం మరింత ఆనందంగా ఉందన్నారు.