ఈ ముద్దుల్ని అదోలా చూడొద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ పల్లాల, సంజయ్ నిర్మించిన చిత్రం -24 కిసెస్. అదిత్ అరుణ్, హెబాపటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రానికి దర్శకుడు అయోధ్యకుమార్. సినిమా ట్రైలర్ విడుదల చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ మిణుగురులు చిత్రానికి నంది అవార్డు గెలుచుకున్న దర్శకుడు అయోధ్యకుమార్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ చాలా రాబట్టుకోవాల్సింది ఉందన్నారు. ముద్దు మాటను ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ తప్పుగా ఆలోచించే ప్రమాదం లేకపోలేదని, అయితే రొమాన్స్ పూర్వకాల చరిత్ర నుంచే మొదలైందన్నారు. రామాయణం, మహాభారతంలోనూ రొమాన్స్ ఉందన్నారు. కిస్ అనేది అందమైన భావన అంటూనే, అపోజిట్ జెండర్‌లో పరస్పరం ప్రేమ పెరగాలంటే ఫిజికల్ కనెక్షన్ అవసరమన్నారు. ఇది అందమైన ప్రేమకావ్యం. యూత్ కోసమే కాదు, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సన్నివేశాలెన్నో. ముద్దుని మనోహరంగా, అందంగా చూపించిన చిత్రమిది అన్నారు. దర్శకుడు అయోధ్య మాట్లాడుతూ ట్రైలర్ చూసి నచ్చిందో లేదో మీరే చెప్పాలన్నారు. నరేష్ సినిమా గురించి ఇప్పటికే చెప్పేశారు. రావురమేష్, సీనియర్ నరేష్‌లు ఏదైనా ఒక సినిమా ఒప్పుకుని చేశారంటే, అది వర్త్‌లెస్ మాత్రం కాదు అన్నారు. సినిమాలోని పాటలు బాగా వచ్చాయని, ఆ క్రెడిట్ అంతా డీవోపీకే దక్కుతుందన్నారు. కిస్ ఇవ్వడం గొప్పకాదు, దానికి ముందు వెనుక ఇవ్వాల్సిన ఎమోషన్స్ చాలా కష్టం. అంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. ఆడియన్స్ 24 ముద్దులున్నాయన్న ఉద్దేశంతో రారు, కంటెంట్ ఉంటే తప్పకుండా ఆదరిస్తారు అన్నారు. ఈ సినిమా కోసం సమిష్టిగా కష్టపడ్డామని, ఆదరించి గెలిపించాలని కోరారు. హీరో అనిరుధ్ మాట్లాడుతూ హీరో నాని ఒక ఆడియో ఫంక్షన్‌లో ఒక మాట చెప్పారు. నువ్వు ఏదన్నా లవ్‌స్టోరీ చేస్తే బావుంటుందని. కాని నేను ఇప్పటివరకు అన్నీ డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చాను. ప్రతి లవ్‌స్టోరీలో ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్, అలాగే సినిమాలో ఇగో కూడా కనిపిస్తుంది. సినిమా బ్యానర్‌కి తగ్గట్టుగా ఉంటుంది. ఈ సినిమాకి ఇద్దరు పెద్ద పిల్లర్లు సీనియర్ నరేష్, మరొకరు రావురమేష్. వీళ్ళిద్దరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. హీరోయిన్ హెబా, కీర్తనలు మాట్లాడుతూ అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలు, టీంకి కృతజ్ఞతలు చెప్పారు.