నజ్రీమ్.. రీమేక్‌తో రీఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళ సూపర్‌హిట్ ‘బెంగుళూరు డేస్’ చూసినవాళ్ళకు నజ్రియా నజీమ్ పేరు సుపరిచితమే. తమిళ డబ్బింగ్ ‘రాజా రాణి’తో ఆడియన్స్‌కు బాగా దగ్గరైపోయింది. హీరోయిన్‌గా కెరీర్ పీక్‌లో ఉన్నపుడు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌ను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది నజియా. ఐదేళ్ళ తర్వాత ఓ క్రేజీ ప్రాజెక్టుతో రీ ఎంట్రీ ఇస్తోంది. హిందీ సూపర్‌హిట్ ‘పింక్’ను తమిళ దర్శకుడు హెచ్ విద్ రీమేక్ చేస్తున్నాడు. తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టులో అమితాబ్ పాత్రను ‘తల’ అజిత్ చేస్తుంటే, తాప్సీ పాత్రను నజ్రియా చేస్తోంది. పింక్ పిక్చర్ బేసిక్ ప్లాట్ తీసుకుని తమిళ నేటివిటీకి తగ్గట్టు అజిత్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు రీ డిజైన్ చేస్తున్నాడట. కెరీర్‌కు ఐదేళ్లు గ్యాప్ వచ్చినా, అజిత్‌లాంటి టాప్ స్టార్ నటించే క్రేజీ ప్రాజెక్టుతో రీ ఎంట్రీ ఇస్తుండటంతో -నజ్రీమ్ ఎలా కనిపించబోతోందని ఆడియన్స్‌లో ఆసక్తి మొదలైంది. కెరీర్‌కు సడెన్‌గా ఫుల్‌స్టాప్ పెట్టిన విషయంపై నజ్రియాకు ఎదురైన ప్రశ్నలకు అప్పట్లో గడుసుగానే సమాధానమిచ్చింది. ‘అది నా సొంత నిర్ణయం. నా కెరీర్ విషయంలో పహద్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు’ అన్నది ఆమె ఆన్సర్. బ్రిలియంట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఇక స్క్రీన్‌పైకి రాకపోవచ్చనే అప్పట్లో అనుకున్నారు అంతా. కానీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది నజ్రియా. దీంతో నజ్రియా టాలెంట్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు దర్శకులు కథలు సైతం సిద్ధం చేస్తున్నారన్న టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఏదేమైతేనేం, పెళ్లి తర్వాత నజ్రియాను సినిమాలకు దూరం పెట్టాడంటూ విమర్శలు ఎదుర్కొంటూ వస్తోన్న పహద్ ఫాజిల్‌కు ఇప్పుడు కాస్త రిలీఫ్ దొరికినట్టే అనుకోవాలి.