నిర్ణయానికి వచ్చేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలైన వెంటనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కాని ..సూర్య ఫలితం తారుమారవ్వడంతో వెంటనే సినిమా చేయడానికి బన్నీ రెడీ కాలేదు. పైగా అదీ ప్రయోగాత్మక చిత్రం కావడంతో, ఈ టైం కెరీర్‌కు ఏమాత్రం శ్రేయస్కరం కాదని భావించి కాస్త గ్యాప్ కోసం ఆగిపోయాడు. అప్పటికే విక్రమ్‌కుమార్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో, సెకెండాఫ్‌లో మార్పులు చేర్పులను సూచించాడు. మళ్లీ విక్రమ్ తీసుకొచ్చిన స్క్రిప్ట్‌లో స్క్రీన్‌ప్లేపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడని, దాన్ని మార్చి పలు వర్షన్‌లను బన్నీకి విక్రమ్‌కుమార్ వినిపిస్తున్నాడని టాక్. అయినా బన్నీ ముందుకు కదలడం లేదు. బన్నీని ఒప్పించేందుకు విక్రమ్‌కుమార్ తన ప్రయత్నాలు తను చేస్తుండగానే, బన్నీ మాత్రం తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో చేసేందుకు సిద్ధమవుతున్నాడని తాజా టాక్. హిందీ సూపర్‌హిట్ చిత్రాన్ని త్రివిక్రమ్‌తో రీమేక్ చేయనున్నాడట. అయితే త్రివిక్రమ్ మరో కథనూ వినిపించడానికి సిద్ధమవుతున్నాడని టాక్. ఈ రెండు కథల్లో ఏదో ఒకటి ఫైనల్ చేసి డిసెంబర్ నుండి సెట్స్‌మీదకు తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. బన్నీకి త్రివిక్రమ్‌తో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇక అరవింద సమేత... చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ బాట పట్టారు త్రివిక్రమ్. మొన్నొచ్చిన అరవింద సమేత చిత్రం బ్లాక్‌బస్టర్ సక్సెస్ దక్కించుకున్న నేపథ్యంలో, రెండో ఆలోచన లేకుండా త్రివిక్రమ్‌తో సినిమా చేయాలనే బన్నీ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. త్రివిక్రమ్‌కు బన్నీ ఫిక్సయినా, విక్రమ్‌కుమార్ మాత్రం మరో హీరోకు షిఫ్ట్ అవ్వాలని భావించడం లేదు. త్రివిక్రమ్‌తో బన్నీ మూవీ చేస్తే, దాని తరువాతే తనతో సినిమా చేస్తాడన్న నమ్మకంతో విక్రమ్ ఉన్నాడు. మరో హీరోను కలిసి కథను వినిపించి ఒప్పించడంకంటే బన్నీతోనే సినిమాను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాడట. సో, అల్లు అర్జున్ కోసం ఇంకొన్నాళ్లు విక్రమ్ వెయిట్ చేయక తప్పదేమో?