పవన్‌తోనూ.. ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనదైన బ్రాండ్ మార్క్‌తో దూసుకుపోతున్న బ్యానర్ మైత్రీ మూవీస్. స్టార్ హీరోలతో వరుసగా చిత్రాలు నిర్మిస్తూ సంచలన విజయాలను నమోదు చేస్తున్నారు. బ్యానర్‌కు తగ్గట్టుగానే ముగ్గురు నిర్మాతల మైత్రి బంధం టాలీవుడ్‌లో మెగా బ్రాండ్‌ను క్రియేట్ చేసింది. తాజాగా నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సవ్యసాచి’ చిత్రం నవంబర్ 2న విడుదలవుతున్న సందర్భంగా నిర్మాతలతో ఇంటర్వ్యూ..
* వరుస విజయాలతో హ్యాపీనా?
- చాలా. మా ప్రయత్నాలన్నీ ఫలితాలిస్తుంటే హ్యాపీయేగా!
* మీ ముగ్గురిలో కథలు వినేదెవరు?
-ముగ్గురం కలిసే వింటాం, ఫైనల్ చేస్తాం. ఇప్పటివరకూ చేసిన సినిమాల విషయంలో ఈ కథ వద్దు అనే అవసరం రాలేదు. ఎందుకంటే, కొరటాల శివ, సుకుమార్‌లాంటి వాళ్లతో పనిచేశాం కనుక.
* మీ ముగ్గురి మైత్రీబంధం గురించి?
-ముగ్గురిదీ విజయవాడే. గత 24 ఏళ్లుగా స్నేహితులం. సినిమా కామన్ ఇంట్రెస్ట్. మాకు ఇదొక్కటే ఎంటర్‌టైన్‌మెంట్. ఆ ఆసక్తితోనే నిర్మాతలయ్యాం.
* సవ్యసాచి గురించి?
-దర్శకుడు చందు ఈ కథను చెప్పినపుడు కొత్తగా అనిపించింది. మెమెరీ లాస్, మల్టిపుల్ డిజార్డర్స్‌ల తరహాలోనే ఇది వెరికోల్ ట్విన్స్ సిండ్రోమ్ అనే డిజార్డర్‌తో వుంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అలాగే నాగచైతన్య కూడా అద్భుతంగా నటించాడు.
* మాధవన్‌ది నెగెటివ్ షేడా?
-ఆయన పాత్ర నెగెటివ్‌గా ఉంటుంది. గేమ్ తరహాలో సాగే యాక్షన్ సినిమా అనుకుంటున్నారు. కానీ కాదు. ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మాధవన్ ఈ ప్రాజెక్టులోకి రావడంతో మరింత హైప్ వచ్చింది. కారణం ఆయనకు తమిళ, హిందీల్లో భారీ సక్సెస్‌లు ఉన్నాయి.
* మీ బ్యానర్‌లో చేయడంతో సినిమాకు బడ్జెట్ పెరిగిందట?
-అలాంటిదేమీ లేదు. ఏ సినిమాకైనా కథ ప్రకారం బడ్జెట్‌ను పెట్టడం జరుగుతుంది. సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దన్నది మా ఆలోచన.
* మీ ముగ్గురిలో ఎవరు ప్రొడక్షన్ పనులు చూస్తుంటారు?
-ముగ్గురం. అయితే రవి ఇక్కడే ఉంటాడు. నేను, మోహన్ ఆరు నెలలు విదేశాలలో ఉంటాం. మాకు ఇక్కడ అద్భుతమైన టీమ్ ఉంది.
* టాలీవుడ్‌లో మైత్రీ మూవీస్ అంటే ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే చాలామందికి అడ్వాన్స్‌లు ఇచ్చేశారట?
-అవును. మంచి సినిమాలు తీయాలన్నది మా డిజైర్. దాని ప్రకారంగా అన్నీ కుదురుకున్నాయి. ఇప్పటికే చాలామందికి అడ్వాన్సులు ఇచ్చామన్నది నిజమే. వరుసగా ఐదు సినిమాలు ఉన్నాయి.
* పవన్‌తో సినిమా ఎప్పుడు?
-తప్పకుండా ఉంటుంది. అదెప్పుడన్నది ఆయన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
* ఆయన రాజకీయాల్లో ఉన్నాడుగా?
-రాజకీయాల్లోకి వెళ్లినా సరే ఆయన చేద్దామన్నపుడు మేము సిద్ధమే.
* త్రివిక్రమ్‌తో సినిమా ఎప్పుడు?
-త్రివిక్రమ్ కూడా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
* మీ బ్యానర్‌లో దర్శకులు, హీరోలు మళ్లీ మళ్లీ చేయడానికి కారణం?
-కారణమంటే వాళ్లకి ఇక్కడ కంఫర్ట్ లెవెల్స్ బాగుంటున్నాయనేమో!
* భారీ బడ్జెట్ సినిమాలు, మిడిల్ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు, చిన్న బడ్జెట్‌లో సినిమాలు చేసే ఆలోచన ఉందా?
-తప్పకుండా. ప్రస్తుతం కోటి రూపాయల్లో ఓ సినిమాను ప్లాన్ చేశాం. రితీష్ అనే హైదరాబాద్ అతను దర్శకత్వం చేస్తున్నాడు. మరో పది రోజుల్లో షూటింగ్ ప్రారంభమవుతుంది. మంచి కంటెంట్ ఉంటే సినిమాలు చేయడానికి సిద్ధమే!
* తదుపరి చిత్రాలు?
-మహేష్ - సుకుమార్‌ల చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. అలాగే రవితేజ అమర్ అక్బర్ ఆంటోని ఈనెల 16న విడుదలవుతోంది. రవితేజతో సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించే తేరీ రీమేక్ నవంబర్ చివరలో మొదలవుతుంది. దాంతోపాటు నాని, ఎన్టీఆర్‌లతో సినిమాలు ఉంటాయి.

-శ్రీనివాస్ ఆర్.రావ్