డబ్బింగ్ పూర్తిచేసిన సర్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఏప్రిల్ 8న విడుదల
చేసేందుకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన ఆడియోకి మంచి
రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బిజినెస్ పరంగా
సంచలనం క్రియేట్ చేస్తున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జోరుగా
జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మిగిలిన రెండు పాటలను త్వరలోనే చిత్రీకరిస్తారు. అందుకోసం
ఈ టీమ్ స్విట్జర్లాండ్ వెళ్లింది. ఇప్పటివరకు డబ్బింగ్‌లో పాల్గొన్న పవన్, డబ్బింగ్ పూర్తిచేసి స్విట్జర్లాండ్ వెళ్లారు. పవర్ ఫేమ్ బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శరత్ మరార్
నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హిందీలో కూడా ఏకకాలంలో విడుదల
చేస్తున్నారు. ఇప్పటికే హిందీ ట్రైలర్స్‌కు కూడా భారీ స్పందన లభించడంతోపాటు హిందీ
బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఏరోస్ సంస్థ హిందీలో విడుదల చేస్తున్న
ఈ సినిమా ‘బాహుబలి’ తరువాత ఆ స్థాయిలో రికార్డు ధర పలకడం విశేషం.