ముందు చిరు.. తరువాత విజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్ర, సింహలాంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన కొరటాల శివ, మిర్చితో దర్శకుడిగా మారాడు. తర్వాత శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను వంటి వరుస హిట్లుతో అగ్ర దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ ప్రొడ్యూసర్లు, టాప్ హీరోలు కొరటాల కోసం క్యూకట్టే పరిస్థితి ఉంది. అయితే, కొరటాల చిరంజీవితో సినిమా చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. భరత్ అనే నేను సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని, చిరు కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లకుండానే, తరువాతి చిత్రం విజయ్ దేవరకొండతో ఉండబోతుందన్న వార్తలూ వినిపిస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం సైరా షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల సినిమా ఉంటుంది. ఇక తాజాగా నోటాలాంటి డిజాస్టర్‌తో డీలాపడ్డ విజయ్, కొరటాల దర్శకత్వంలో నటించబోతున్నాడన్న వార్త వినగానే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇటీవల ఒక ఫంక్షన్‌లో కలిసిన వీళ్లిద్దరూ సినిమా గురించి చర్చించుకున్నారట. దీంతో కొరటాల కూడా విజయ్‌తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియొచ్చు.