బన్నీ సరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే తెలుగులో విడుదలైన ఆర్‌ఎక్స్ 100 సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ నెగెటివ్ షేడ్‌లో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటనతోపాటు గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు వస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. నాపేరు సూర్య సినిమా తరువాత అల్లు అర్జున్ నటించే తదుపరి చిత్రంలో పాయల్ హీరోయిన్‌గా నటిస్తుందట. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని, ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే హ్యాట్రిక్ సినిమాలో పాయిల్ ఛాన్స్ కొట్టేయడం విశేషం.