హారర్ థ్రిల్లర్‌తో అశ్విన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతకుముందు ఆ తరువాత, లవర్స్, కేరింత వంటి సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో సుమంత్ అశ్విన్, దండుపాళ్యం సిరీస్ దర్శకుడు శ్రీనివాసరాజు కాంబినేషన్‌లో భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ‘గరుడవేగ’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సరికొత్త కానె్సప్ట్‌తో హారర్ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. నవంబర్ రెండో వారంలో ప్రారంభించనున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ‘స్పాన్ ఉన్న సబ్జెక్ట్. అందుకే నాలుగు భాషల్లో సుమంత్ అశ్విన్ హీరోగా ప్లాన్ చేశాం. ఇతర పాత్రల్లో భారీ తారాగణం నటిస్తారు. రీరికార్డింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యమున్న హారర్ థ్రిల్లర్. అందుకే మణిశర్మ మ్యూజిక్ చేస్తున్నారు. హారర్ థ్రిల్లర్స్‌లోనే ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుంది. దండుపాళ్యం 1,2,3 చిత్రాల విజయాలిచ్చిన ఉత్సాహంతో ఈ సినిమాని పెద్ద లెవల్‌లో హైటెక్నికల్ వేల్యూస్, భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. గరుడవేగ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ ఎం.కోటేశ్వరరాజు నిర్మాత కావడం చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా సినిమాను చేసేందుకు నాకు ఫుల్ సపోర్ట్‌ఇవ్వడం ఆనందం కలిగిస్తోంది’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌వర్మ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైందన్నారు. నవంబర్ రెండోవారంలోనే సినిమా ప్రారంభించి, కంటిన్యూ షెడ్యూల్స్‌తో నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేశాం’ అన్నారు.