లవ్ ఫెయలైతే.. అంతేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిషాల్ శైలేష్‌జైన్, హేమలత హీరో హీరోయిన్లుగా శుక్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3 చిత్రం బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ప్రారంభమైంది. విఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో సంజీవ్‌కుమార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సత్యప్రకాశ్ క్లాప్ కొట్టగా నిర్మాత సంజీవ్‌కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా సత్యప్రకాశ్ దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్‌లకు అభినందనలు తెలిపారు. సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. నిర్మాత సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ ‘ఓ మంచి టీమ్‌కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నా. యంగ్ టాలెంటెడ్ టీం కుదిరింది. డిఫరెంట్ సినిమా చేయాలని ఎదురుచూస్తున్న తరుణంలో ఫణీంద్ర కలిశారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి రెడీ అయ్యాను. హీరో మిషాల్‌జైన్ తొలి సినిమా. షార్ట్ ఫిలింస్‌లో చూసి తనకు మా సినిమాలో అవకాశమిచ్చాను. హేమలత మంచి నటిగా పేరు తెచ్చుకుంటుంది. ఆమె నటిస్తున్న రెండో చిత్రమిది. సత్యప్రకాశ్ వంటి సీనియర్ యాక్టర్ మా సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. మంచి సినిమా అవుతుందని నమ్మకం ఉంది’ అన్నారు. దర్శకుడు విఎస్ ఫణీంద్ర మాట్లాడుతూ ‘మంచి కథ, టీమ్‌తో చేస్తున్న సినిమా ఇది. సత్యప్రకాశ్ చాలా మంచి పాత్ర చేశారు. ఆయన్ను కొత్తకోణంలో చూస్తారు. సినిమాలో నాలుగు సాంగ్స్ ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ హర్ష మంచి సంగీతం అందించారు. ఒకరికొకరు అనే ప్రేమలో ఒకరుపోతే మరొకరు అనే ధోరణి వచ్చింది. ఇలా ఎందుకు? అని ఆలోచించుకుని రాసుకున్న లవ్ అండ్ యాక్షన్ మూవీ ఇది. మిషాల్, హీరోయిన్ హేమలత సహా టీమ్‌కు థాంక్స్’ అన్నారు. మిషాల్ శైలేష్ జైన్ మాట్లాడుతూ ‘ఇది నా తొలి చిత్రం. అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అన్నారు. హీరోయిన్ హేమలత మాట్లాడుతూ ‘ఇది నా రెండో చిత్రం. డైరెక్టర్ చెప్పిన కథ బాగానచ్చింది. మంచి నిర్మాత సహకారం అందిస్తున్నారు. మంచి టీం కుదిరింది. మిషాల్ నాకు బాగా తెలుసు. దర్శక నిర్మాత సహా అందరికీ థాంక్స్’ అన్నారు.