రీమిక్స్ ఆదుకుంటుందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దికాలం క్రితం రీమిక్స్‌లు తెలుగు పరిశ్రమను ఒక ఊపు ఊపేశాయి. తరువాత గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు హీరో చైతూ -తండ్రి నాగ్ హిట్టు సాంగ్‌ను రీమిక్స్‌గా సవ్యసాచిలో ప్రయోగం చేస్తున్నాడు. చైతూ హీరోగా తాజా చిత్రం ‘సవ్యసాచి’ వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. చైతూతో నిధి అగర్వాల్ జోడీ కడితే, చందు మొండేటి దర్శకత్వం వహించాడు. లోడెడ్ యాక్షన్ స్టోరీలో ఆడియన్స్‌కు రిలీఫ్‌గా ఓ రీమిక్స్ డిజైన్ చేశారన్నది తెలిసిందే. పాతికేళ్ల క్రితం వచ్చిన నాగ్ హిట్టు మూవీ ‘అల్లరి అల్లుడు’లోని ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగాయత్తు’ సాంగ్‌ను సవ్యసాచి కోసం రీమిక్స్ చేసి బుధవారం ట్రైలర్ విడుదల చేశారు. అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన సాంగ్, రీమిక్స్ బీట్‌లో పూర్తిగా తేలిపోయింది. ఒరిజినల్ సాంగ్‌లోని మార్దవం రీమిక్స్‌లో మాయమైంది. చైతూ, నిధి డ్యాన్స్ కంపోజిషన్‌లోనూ కంగారు స్టెప్పులు తప్ప ‘లైఫ్’ లేకపోవడం చూస్తుంటే -మరోసారి రీమిక్స్ ఫెయిలవుతుందా? అన్న డౌటు రాకపోదు. ఒరిజినల్ సాంగ్‌ను ఎస్పీబీ, చిత్ర పాడితే, రీమేక్‌ను ఫృథ్వీ చంద్ర, వౌనిమ పాడారు. అయితే ఒరిజినల్ సాంగ్‌లోని నాగ్ స్టయిల్ స్టెప్పులు, రమ్యకృష్ణను టీజ్ చేసిన చిలిపితనం అప్పట్లో ఆడియన్స్‌కు బాగా కనెక్టైంది. సవ్యసాచి కోసం చేసిన రీమిక్స్‌లో బుధవారం విడుదల చేసిన టీజర్ పార్ట్‌లో ఒరిజినల్‌ను మించే స్వీట్‌నెస్ ఏమీ లేకపోవడం గమనార్హం. ఇప్పటికే చాలా తెలుగు చిత్రాల్లో చేసిన రీమిక్స్ ప్రయోగాలు విఫలమైన నేపథ్యంలో, సవ్యసాచి రీమిక్స్ పూర్తి సాంగ్ ఎలాంటి ఆదరణ సాధిస్తుందన్నది వచ్చే శుక్రవారంతో తేలిపోనుంది. సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తే, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవి, మోహన్ చెరుకూరి నిర్మించారు. మాధవన్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.