నారాయణ్‌గా మాధవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాంతీయ, జాతీయ సినీ పరిశ్రమలను బయోపిక్‌లు వెంటాడుతున్నాయి. వివిధ రంగాల్లోని ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా తీస్తోన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో -అదొక ఒరవడిగా పరిశ్రమ పరుగులు తీస్తోంది. అలా ఇస్రో శాస్తవ్రేత్త జీవితంలోని క్రైం క్షణాలను కథగా ఎంచుకుని తెరపైకి వస్తోన్న చిత్రం -రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. ప్రముఖ నటుడు మాధవన్ నంబి పాత్రను పోషిస్తున్నాడు. నంబి నారాయణ్ జీవిత కథ, అందులోని గూఢచర్యం ఘట్టాన్ని జాతీయ అవార్డు గ్రహీత అనంత్ మహాదేవన్ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. దర్శకత్వ విభాగంలో మాధవన్ సైతం తన పాత్ర పోషిస్తున్నాడు. తెలుగు, తమిళం, హిందీల్లో తెరకెక్కుతున్న రాకెట్రీ టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం -మార్స్‌వైపు దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్‌వీ సన్నివేశాన్ని టీజర్‌లో ప్రధానంగా చూపించారు. ‘నా పేరు నంబి. రాకెట్రీలో 35ఏళ్లు పని చేస్తే, 50 రోజులు జైల్లో గడిపాను. ఆ 50 రోజుల మూల్యం ఏదైతే నా దేశం చెల్లించిందో దాని గురించే ఈ కథ. నా గురించి కాదు’ అన్న నంబి వాయిస్ ఓవర్‌తో టీజర్ ముగించారు. మార్స్ ప్రయోగం కోసం నాసా, రష్యాలు ఎన్నిసార్లు ప్రయత్నించాయి, ఎంత ఖర్చు పెట్టాయన్న లెక్కలను చూపిస్తూనే, మార్స్ మిషన్‌ను తొలి ప్రయత్నంలోనే సక్సెస్ చేసిన ఇస్రో ఘనత, ఎంత తక్కువ ఖర్చుతో మిషన్ పూర్తి చేసిందన్న విజ్ఞానదాయక విశేషాలనూ టీజర్‌లో చూపించేందుకు ప్రయత్నించారు.
గతంలో ఇస్రోలో తలెత్తిన గూఢచర్యం కేసు, అందుకు శాస్తవ్రేత్త నంబి నారాయణే బాధ్యుడంటూ అరెస్ట్ చేయడం, ఆ తరువాత నిర్దోషిగా ఆయన ఎలా బయటకు వచ్చాడన్నదే సినిమా ప్రధాన ఇతివృత్తం. ఆ పాత్ర కోసం తాను నంబిని స్వయంగా కలిసి మాట్లాడానంటూ గతంలో మాధవన్ అనేకసార్లు చెప్పుకొచ్చారు. అసలు ఇస్రోలో ఏం జరిగింది? ఆ కేసు నంబిపై ఎలా మోపబడింది? దాన్నుంచి బయట పడటానికి ఆయనెంత కష్టపడ్డాడు?లాంటి వివరాలన్నీ సేకరించి పాత్రను ఆకళింపు చేసుకున్న మాధవన్, వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు కూడా. వచ్చే వేసవిలో చిత్రాన్ని థియేటర్లకు తెస్తామని చిత్రబృందం చెబుతున్న తరుణంలో, బుధవారం విడుదలైన టీజర్ అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది.