సందీప్ భయపెడతాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుడన్ పోలీస్, ఉల్‌కుత్తు వంటి చిత్రాలను రూపొందించిన కార్తిక్‌రాజు ఈసారి ద్విభాషా చిత్రంగా సరికొత్త హారర్ థ్రిల్లర్‌తో వస్తున్నాడు. సందీప్ కిషన్, అన్యసింగ్ జోడీగా తెలుగు, తమిళంలో వి స్టూడియోస్ తెరకెక్కిస్తున్న చిత్రం -కన్నాడి. తమిళంలోనూ మూడు నాలుగు చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న సందీప్ కిషన్ చాలెంజింగ్ పాత్ర చేస్తుంటే, అన్యసింగ్ హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది. ఆనంద్‌రాజ్, మురళీశర్మ, పూర్ణిమా భాగ్యరాజ్, కరుణాకరన్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ‘వైవిధ్యమైన జానర్ హార్రర్. అయితే వరుస సినిమాలతో దానికో ఫార్మాట్ ఫిక్స్ చేసేశారు. ఆ ఫార్మాట్‌కు భిన్నంగా చేస్తున్న కన్నాడి -ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం’ అంటున్నాడు దర్శకుడు కార్తిక్‌రాజ్. మెయిన్ జోనర్ హార్రరే అయినా, థ్రిల్లర్, రొమాంటిక్ అంశాలు ఆడియన్స్‌ను వినోదాన్ని పంచుతాయని నమ్మకంగా చెబుతోంది యూనిట్. చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న కన్నాడి -శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోందని యూనిట్ వెల్లడించింది.