సంక్రాంతికి పక్కా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్‌లో భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్న చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్‌రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాగణం. 2019 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ ‘రామ్‌చరణ్, బోయపాటి కాంబినేషన్‌లో మా బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ ఇమేజ్ హీరో, డైరెక్టర్ కలయికలో సిద్ధమవుతోన్న సినిమా ఆడియన్స్‌లో ఆసక్తి పెంచుతోంది. మెగాభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు దీటుగా సినిమాను కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. షూటింగ్ చివరి దశకు చేరింది. రెండు పాటలు వినా నవంబర్ 10కి షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నవంబర్ 9 నుంచే డబ్బింగ్ మొదలవుతుంది. త్వరలోనే ఫస్ట్‌లుక్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి 2019 సంక్రాంతి పండుగ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేస్తాం’ అన్నారు.