భాగ’మతి పోగొట్టే.. రీఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగమతి తర్వాత అనుష్క మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కొత్త సినిమా తాలూకు అప్ డేట్స్ లేవు. పోనీ పెళ్లి వార్తయినా ఉందా? అంటే అదీ లేదు. గత కొంతకాలంగా వెయిట్ లాస్‌మీద సీరియస్‌గా ఫోకస్‌పెట్టి దానికి సంబంధించిన శిక్షణలో బిజీగావున్న అనుష్క, త్వరలోనే స్వదేశానికి తిరిగి రానుంది. అందరూ ఊహించినట్టు పెళ్లికోసం కాదు, ఓ తమిళ సినిమాలో నటించేందుకు. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులో ఇంతకుముందు చేయని సరికొత్త పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్ట టాక్. అనుష్క తిరిగి వచ్చిన తరువాత అన్ని వివరాలు తెలియజేస్తారట. హీరో ఎవరు? లాంటి విషయాలు మాత్రం ఇప్పటికీ రహస్యమే. బాహుబలి తర్వాత నిజానికి అనుష్కకు లెక్కలేనన్ని ఆఫర్లు వచ్చాయి. భాగమతి తర్వాత కూడా అంతే. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే 152 సినిమాకు అనుష్కనే అడిగినట్టు ప్రచారం జరిగింది. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి అనుష్క స్వయంగా క్లారిటీ ఇస్తే తప్ప ఈ కథనాకు చెక్ పడదు.