ఎప్పటికీ.. ఆణిముత్యమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ సినిమా ముందు భారతీయ సినిమాకు ఇంకా గుర్తింపు మిగిలివుందీ అంటే -పాతతరం దిగ్గజ దర్శకులు రూపొందించి పదిలపర్చిన ఆణిముత్యాలే కారణం. 1955లో సత్యజిత్ రే రూపొందించిన ‘పథేర్ పాంచాలి’ చిత్రం -ఇప్పటికీ భారతీయ సినిమా ప్రమాణాల ప్రామాణికత, ప్రాముఖ్యతను నిలబెడుతూనే ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ వంద విదేశీ చిత్రాల్లో ‘పథేర్ పాంచాలి’కి పదిహేనొవ స్థానం దక్కింది. ఇంగ్లీష్ చానెల్ బీబీసీ రూపొందించిన విదేశీ ఉత్తమ చిత్రాల జాబితాలో అకిర కురసోవా 1954లో రూపొందించిన జపనీస్ చిత్రం ‘సెవెన్ సమురాయ్’కి ప్రథమ స్థానం లభిస్తే, టాప్ హండ్రెడ్‌లో చివరి మాస్టర్ పీస్ స్థానాన్ని 1988లో థియో ఏంజిలోపొలస్ రూపొందించిన ‘ల్యాండ్‌స్కేప్ ఇన్ ది మిస్ట్’ చిత్రం దక్కించుకుంది. 1948లో విట్టోరియో డి సికా రూపొందించిన మూకీ చిత్రం ‘బైసికిల్ థీవ్స్’ ద్వితీయ స్థానంలో నిలబడితే, 1953లో యసుజిరో రూపొందించిన టోక్యో స్టోరీ తృతీయస్థానాన్ని ఆక్రమించింది. మూడేళ్లుగా బీబీసీ కల్చర్ విభాగం ఈ అత్యుత్తమ సినిమా పోల్ నిర్వహిస్తోంది. టాప్ హండ్రెడ్ గ్రేటెస్ట్ అమెరికన్ చిత్రాలు, 21 సెంచరీలో వచ్చిన అత్యుత్తమ విదేశీ చిత్రాలు, గ్రేటెస్ట్ కామడీ చిత్రాల జాబితాను రూపొందిస్తోంది. ప్రపంచం మొత్తంమీద 43 దేశాలకు చెందిన, 41 భాషల్లోని 209 మంది విమర్శకుల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించి బీబీసీ ఈ జాబితాను రూపొందించింది. బీబీసీ ప్రకటించిన టాప్ హండ్రెడ్ చిత్రాల్లో 24 దేశాల్లోని 19 భాషలకు చెందిన 67 మంది దర్శకుల చిత్రాలు ఉన్నాయి. సినిమా అంటే ప్రపంచ నిర్వచన కోణంలో ఫ్రెంచ్ అన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేస్తూ -టాప్ హండ్రెడ్ చిత్రాల్లో 27 ఫ్రెంచ్ చిత్రాలకు స్థానం దొరకడం గమనార్హం. అలాగే 12 మాండరిన్ చిత్రాలు, ఇటాలియన్, జపాన్ చిత్రాలు 11 ఉన్నాయి. ఇక్కడ విశేషమేమంటే -ప్రపంచ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలందుకున్న ‘సెవెన్ సమురాయ్’కు జపాన్ సినీ విమర్శకులు ఒక్క ఓటు కూడా వేయకపోవడం. బీబీసీ కల్చర్ ఎంచుకున్న 209 మంది విమర్శకుల్లో ఆరుగురు క్రిటిక్స్ జపాన్ నుంచి ఉన్నారు. వారిలో ఏ ఒక్కరూ అకిర కురసోవా ఏ ఒక్క చిత్రానికీ ఓటు వేయలేదు. టాప్ హండ్రెడ్‌లో నాలుగు మాత్రమే మహిళా దర్శకుల చిత్రాలు ఉంటే, పోలింగ్‌లో పాల్గొన్న విమర్శకుల్లో 45 శాతం మహిళలే ఉండటం గమనార్హం. ప్రముఖ రచయిత బీభూతిభూషణ్ బందోపాధ్యాయ 1929లో రాసిన బెంగాలీ నవల ఆధారంగా పథేర్ పాంచాలి చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా పరిచయమయ్యారు సత్యజిత్ రే. ఓ కుగ్రామంలోని నిరుపేద కుటుంబం జీవన వైచిత్రే ‘పథేర్ పాంచాలి’ కథ.