మరుగుజ్జుతో చందమామలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందమామ ముఖంలో ముఖం పెట్టి చూశాడట బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్. కింగ్‌ఖాన్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం జీరో. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఖాన్ -ఇద్దరు భామల కత్రినా కైఫ్, అనుష్క శర్మలతో కనిపించనున్నాడు. వాళ్లిద్దర్నీ ఫస్ట్‌లుక్ పరిచయం చేస్తూ సినిమాకు సంబంధించిన రెండు పోస్టర్లను ట్విట్టర్‌లో విడుదల చేశాడు షారుక్. ‘తారలను దగ్గర్నుంచి చూడాలన్నది చాలామంది కల. కానీ, చందమామనే ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నా’నంటూ కత్రినా పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. ఖాన్‌పైకి వొంగి చూస్తున్న కత్రినాను చందమామతో పోల్చాడు షారుక్. ఇక అనుష్క శర్మతో ఉన్న పోస్టర్‌ను విడుదల చేస్తూ -‘ప్రపంచంలో నాలాంటి మనిషి ఆమె ఒక్కర్తే’నంటూ మరో క్యాప్షన్ ఇచ్చాడు. దీన్నిబట్టి మరగుజ్జు బువాసింగ్ (షారుక్)కు సరిజోడు అనుష్క శర్మేనన్నది అర్థం చేసుకోవచ్చు. సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై షారుక్ నిర్మిస్తోన్న చిత్రం ‘జీరో’. నవంబర్ 2న కింగ్‌ఖాన్ పుట్టినరోజు సందర్భంగా అతిధి పాత్రలో కనిపించనున్న సల్మాన్‌తో ట్రైలర్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే గురువారమే ఇద్దరు హీరోయిన్ల లుక్‌లు విడుదలయ్యాయి.