స్వచ్ఛమైన ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన లొకేషన్స్‌లో అద్భుత కథాకధనాలతో తెరకెక్కిన చిత్రం -మంచు కురిసె వేళలో. రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా చేస్తున్న చిత్రానికి దర్శకుడు బాల బోడెపూడి. దర్శకుడు దేవా కట్టా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బాల తొలిసారి దర్శక నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సినిమా చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు పూరె్తైన సందర్భంగా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ -మంచు కురిసే వేళలో స్వచ్ఛమైన ప్రేమ కథ అన్నారు. సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అదనపు బలమన్నారు. రామ్‌కార్తీక్ కెరీర్‌లో ఇదో ఉత్తమ చిత్రం అవుతుందని, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రానికి సంబంధించి త్వరలో ఆడియోను, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తామన్నారు. చిత్రానికి సంగీతం శ్రావణ్ భరద్వాజ్, కెమెరా తిరుజ్ఞాన, ప్రవీణ్‌కుమార్ పంగులూరి అందించారు.