రెక్కీలో సడక్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సీక్వెల్స్ షరా మామూలే. హిట్టయిన చిత్రాలకు సిరీస్‌లు రూపొందిస్తూనే ఉంటారు. తాజాగా మహేష్‌భట్ హిట్టు మూవీ సడక్‌కు సిరీస్‌గా సడక్-2 రాబోతోంది. మహేష్‌భట్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఆదిత్యరాయ్, సంజయ్‌దత్, పూజాభట్ ముఖ్య పాత్రధారులు. సడక్-2 చిత్రానికి సంబంధించి రెక్కీ మొదలైనట్టు పూజాభట్ వెల్లడించింది. పర్వత సాణువుల బ్యాక్‌డ్రాప్‌లో హెలికాఫ్టర్ ముందు తండ్రి మహేష్‌భట్‌తో కలిసి తీసుకున్న ఇమేజ్‌ను పోస్టు చేస్తూ ‘సడక్-2 రెక్కీ మొదలైంది. మహేష్‌భట్‌తో కలిసి ఆకాశంలో ప్రయాణించే అవకాశం దక్కింది. జీవితంలో ఇదో గొప్ప అనుభూతి’ అని క్యాప్షన్‌లో పేర్కొంది. 1991లో సంజయ్‌దత్, పూజాభట్ జోడీగా వచ్చిన హిట్ చిత్రం సడక్. ఈ చిత్రానికి చేస్తున్న సీక్వెల్ సడక్-2 2019 నవంబర్ 15న విడుదల కానుంది. సీక్వెల్‌లో సంజయ్, పూజాతోపాటు ఆలియా-ఆదిత్యరాయ్ కఫూర్‌లు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. గత ఏడాదే దీనిపై పూజాభట్ ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ‘త్వరలోనే సడక్-2 నిర్మిస్తాం. నిజమైన సంజయ్‌దత్ ఎలాంటివాడో ఆ చిత్రంలో చూపిస్తాం. అతను చాలా వత్తిడిలో ఉన్నాడు. ఈ చిత్రంతో ఒకింత ఉపశమనం అతనికి. అయితే, ఇది పక్కా కమర్షియల్ ఫిల్మ్’ అంటూ పూజాభట్ ప్రకటించింది. ఆ ప్రకటన ఇప్పటికి కార్యరూపం దాలుస్తోంది.