మెచ్చేలా ఏబీసీడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుక్సార్ థిల్లాన్‌తో జత కట్టిన అల్లు శిరీష్ చేస్తున్న తాజా చిత్రం -ఏబీసీడీ. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ పాత్రలో చేస్తున్నాడు. సంజీవ్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న క్రేజీ ప్రాజెక్టును మధుర శ్రీ్ధర్‌రెడ్డి, యస్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడ సంగీత దర్శకుడు జుధాసాంధీ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రాజా, కోట, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియాలో చివరి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. తదుపరి అమెరికా షెడ్యూల్‌తో డిసెంబర్ 15కు షూటింగ్ పూర్తికానుంది. వచ్చే ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఏబీసీడీని తెలుగులో అల్లు శిరీష్‌తో నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అక్కడ దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ చేస్తున్నాడని, మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా నటిస్తున్నట్టు చెప్పారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఇతివృత్తం కావడంతో, నేటివిటీకి తగ్గట్టుగా కథ, కథనం, మాటలు మలచుకుని రీమేక్ చేస్తున్నట్టు చెప్పారు.