రానాతో సాయి పల్లవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవిష్ణు హీరోగా ‘నీది నాది ఒకే కథ’ అనే చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఉడుగుల మరోసారి వైవిధ్యమైన కథతో మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన రానా, సాయిపల్లవి జంటగా ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇక రానా ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉండగా సాయి పల్లవి శర్వానంద్‌తో కలిసి పడి పడి లేచే మనసు చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా సుధాకర్ చెరుకూరే నిర్మిస్తున్నారు.