హవా చూపించారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత సీజన్ -హానెస్ట్ బేస్ట్ జోనర్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. కానె్సప్ట్ ఏదైనా నిజాయితీగా రాసుకుంటే ప్రేక్షకులు అంగీకరిస్తున్నారు. అలా వస్తోన్న మరో జోనర్ బేస్డ్ ఫిల్మ్ ‘హవా’. రీసెంట్‌గా రానా చేతులమీదుగా విడుదలైన మోషన్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘హవా’ కానె్సప్ట్ పోస్టర్‌ను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు. సస్పెన్స్, క్రైమ్, కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి ‘9 గంటలకు 9 నేరాలలు 9 బ్రెయిన్స్’ అంటూ పెట్టిన క్యాప్షన్ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఆ తొమ్మిది మంది ఎవరు? ఏం నేరాలు చేశారు? అదీ తొమ్మిది గంటల్లోనే.. తద్వారా వాళ్ల లైఫ్‌లో జరిగిన మార్పులేంటి? అనేది థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో సాగే కథ. ఈ మూవీ ట్రైలర్‌ను సినిమా ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఉందని కార్యక్రమానికి హాజరైన అతిథులు ఆకాంక్షించారు. ఇక మధుర శ్రీ్ధర్ విడుదల చేస్తున్న సినిమా గురించి చిత్ర ప్రముఖులు దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ న్యూ టాలెంట్ అంతా కొత్త ఐడియాస్, కథలతో వస్తోంది. వీళ్లవల్ల మేము కాస్త జాగ్రత్తగా సినిమాలు చేయాల్సి వస్తోందన్నారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. నిర్మాత, దర్శకుడు మధుర శ్రీ్ధర్ మాట్లాడుతూ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌తోపాటు యాక్షన్ పార్ట్‌తోపాటు మంచి అవుట్‌పుట్ వచ్చింది. నవంబర్ 23న విడుదలవుతున్న చిత్రానికి మంచి ఆదరణ దక్కుతుందని నమ్ముతున్నాం అన్నారు. దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ సినిమా గురించి ఏం తెలియకుండానే కార్యక్రమానికి వచ్చాను. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై రెస్పెక్ట్ పెరిగింది. హానెస్ట్‌గా డీల్ చేసిన క్రైమ్ డ్రామా అని అర్థవౌతోంది. సినిమా సూపర్‌హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. నిర్మాత రాజ్‌కందుకూరి మాట్లాడుతూ మనసు పెట్టి కథ రాసుకుంటే చిన్న ఎటెంప్ట్ కూడా విజయాన్నందిస్తుంది. మంచి సోల్ ఉంటే ఏ సినిమా అయినా ఆడుతుంది. కానీ ఇందులో తొమ్మిది సోల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. కంటెంట్‌లో సత్తా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అన్నారు. చిత్ర దర్శకుడు మహష్‌రెడ్డి మాట్లాడుతూ సినిమా గురించి నేను ఇప్పుడే ఏమీ చెప్పను. 23న సినిమా విడుదల కాబోతోంది. మమ్మల్ని మా సినిమాను ఆదరిస్తారని కోరుతున్నా అన్నారు. హీరో చైతన్య మదాడి, హీరోయిన్ దివి ప్రసన్న, సంగీత దర్శకుడు గిప్టన్ తదితరులు పాల్గొన్నారు.