ఖతర్నాక్ కాంబినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కువ శాతం సినిమాలు -కాంబినేషన్‌లతోనే ఆసక్తి రేకెత్తిస్తాయి. క్రేజీ కాంబినేషన్ అంటూ కథనాలు వెలువడిన దగ్గర్నుంచీ -సినిమా
ఎప్పుడొస్తుందా? అని ప్రేక్షకుడు ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో భారీ స్టార్లుంటే -ఆ సినిమా రేంజ్ చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలాంటి ఆసక్తిరేపే కాంబినేషన్స్ రాబోతున్నాయి. ఈ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడొస్తుందా? అన్న ఆసక్తి ప్రతి సినిమా లవర్‌లోనూ ఉంది. మరి అలాంటి క్రేజీ
కాంబినేషన్, అలాంటి స్టార్స్‌తో
సినిమావస్తే ఫ్యాన్స్ ఆనందమే వేరు.
అలాంటివాటిలో -ముందుగా చర్చించాల్సింది మహేష్ -రాజవౌళి కాంబినేషన్. వీరిద్దరి కలయికలో సినిమా అంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. సినిమా తప్పకుండా ఉంటుందని అటు మహేష్, ఇటు రాజవౌళి ఇద్దరూ చెబుతున్నపుడల్లా -కాంబోపై కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. కానీ వీరి కాంబినేషన్ మాత్రం ఇంతవరకూ సెట్ కాలేదు. అశ్వనీదత్ లాంటి నిర్మాతలు ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసినా, వర్కవుట్ అయిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రాజవౌళి రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో క్రేజీ మల్టీస్టారర్ చేస్తున్నాడు. బహుశా ఈ సినిమా తరువాత మహేష్‌తో సినిమా చేస్తాడేమో జక్కన్న. తరువాత అంతే ఆసక్తి రేకెత్తిస్తున్న కాంబినేషన్ రామ్‌చరణ్, కొరటాల శివలది. ఈ సినిమా గురించి మెగా ఫాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. వీళ్ల కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌పైకి వస్తుందంటూ జోరుగానే ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు కొరటాల శివ అటు మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు సిద్ధమవుతున్నాడు. రైతు అనే కథతో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. బహుశా ఈ సినిమా తరువాతే కొరటాల శివ రామ్‌చరణ్‌తో సినిమా ఉండొచ్చు.
ఇదే రేంజ్‌లో ఆసక్తిని పెంచే మరో చిత్రం బాలయ్య -బోయపాటి కాంబినేషన్. ఇప్పటికే వీరిద్దరు రెండు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు. తాజాగా మూడోసారి సినిమాకు ఇద్దరు ఓకే చెప్పారు. నిజానికి బాలయ్య 100వ సినిమా చేయాలని ప్లాన్ చేసాడు బోయపాటి. కానీ ఎందుకో కుదరలేదు. సింహ, లెజెండ్‌లాంటి సంచలన విజయాల తరువాత అదే రేంజ్‌లో సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ కాంబోలో సినిమా సెట్స్‌పైకి రావొచ్చు.
ఇక మరోసారి మహేష్‌బాబు క్రేజీ దర్శకుడు సుకుమార్‌తో సినిమాకు ఓకే చెప్పాడు. ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయ్యారు. మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్‌పై మహేష్‌తో సినిమా ప్రకటించాడు సుకుమార్. ఇప్పటికే కథ చర్చలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది. దాంతోపాటు సుకుమార్- ప్రభాస్ కాంబినేషన్‌లో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సాహో, జిల్ రాధాకృష్ణ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ సినిమా సుకుమార్‌తో ఉంటుందని టాక్. ఈ కాంబినేషన్ కూడా టాలీవుడ్‌లో ఆసక్తిపెంచింది. దాంతోపాటు ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోకూడా బాగా వెయిట్ చేయిస్తోంది. ‘జనతాగ్యారేజ్’లాంటి సంచలన సినిమా తరువాత తారక్- కొరటాల కాంబోలో రెండో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అలాగే వెంకటేష్- త్రివిక్రమ్‌ల కాంబో కూడా ఆసక్తి పెంచేదే. వెంకటేష్‌తో రెండు చిత్రాలకు పనిచేసిన త్రివిక్రమ్, అప్పట్నుంచి వెంకీతో సినిమా చేయాలనీ చూస్తున్నా ఎందుకో కుదరట్లేదు. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్‌లో హారిక- హాసిని బ్యానర్‌పై సినిమాను ప్రకటించారు. దాంతోపాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విక్రంకుమార్‌తో సినిమా చేస్తున్నాడనే వార్త ఇప్పటిది కాదు. ఇప్పటికే వీరిద్దరిమధ్య నాలుగైదు సిట్టింగ్స్ కూడా జరిగాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం బయటకు రావట్లేదు. ఇలా మరిన్ని క్రేజీ కాంబినేషన్లను ఆడియనే్స వెతుక్కుంటున్నారు.

-శ్రీ