క్రిష్ రాయబారి అఖిల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గమ్యం’, ‘వేదం’ వంటి చిత్రాలతో దర్శకునిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు క్రిష్. ఆయన ఇటీవలే రూపొందించిన ‘కంచె’ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కమర్షియల్‌గా ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాన్ని రాబట్టకపోయినా గుర్తింపు మాత్రం దక్కింది. తాజాగా తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తికావచ్చిందని తెలిసింది. ఇటీవలే ఈ సినిమాకు ‘రాయబారి’ అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేయించాడు. తన సొంత బ్యానర్ ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ సినిమా రూపొందిస్తారని తెలిసింది. అయితే, ఈ టైటిల్ అక్కినేని అఖిల్ కోసమే పెట్టాడని సమాచారం. ఇదివరకే అఖిల్‌తో రెండవ సినిమా చేయాలని నాగార్జున చర్చలు కూడా జరిపినట్టు తెలిసింది. అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో రెండవ సినిమాతో ఆయన అఖిల్‌ను నిలబెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తానికి అఖిల్‌ను రాయబారిగా మార్చే ప పనిలో వున్నట్టున్నాడు క్రిష్.