కైరా.. కేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తెలుగులో ‘్భరత్ అనే నేను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఏమీ లేదు. అయినా కూడా కైరా అద్వానీకి మంచి గుర్తింపు దక్కింది. భరత్ చిత్రం విడుదలకు ముందే రామ్‌చరణ్-బోయపాటి శ్రీను చిత్రంలో హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ అయింది. ఒకవైపు బాలీవుడ్‌లో నటిస్తూనే మరోవైపు టాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం చేస్తున్న చరణ్ మూవీ ‘వినయ విధేయ రామ’ చిత్రం విడుదలకు ముందే మరికొన్ని ఆఫర్లు కూడా ఈమె తలుపు తడుతున్నాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందబోతున్న చిత్రంలో హీరోయిన్‌గా కైరా అద్వానీ ఎంపిక అయ్యిందని కాస్త బలంగానే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన కథ ఫైనల్ కాలేదు. అప్పుడే హీరోయిన్‌ను దర్శకుడు ఎలా ఫైనల్ చేస్తాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మహేష్‌బాబు-సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న సినిమా కోసం కూడా కైరా అద్వానీని సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈమెతో పనిచేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చిరు 152వ చిత్రం కోసం కూడా కొరటాల శివ ఈమెను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.