అవన్నీ గాసిప్సే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో క్రేజీ ఇమేజ్ తెచ్చుకున్న ఇలియానా అంటే టాలీవుడ్‌కు ప్రత్యేకమైన అభిమానమే ఉంది. తనదైన గ్లామర్‌తో ఆకట్టుకున్న ఇల్లూ బేబీ కొన్నాళ్లు టాలీవుడ్‌కి దూరమైంది. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీతో రీఎంట్రీ ఇస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈనెల 16న విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ఇలియానాతో ముచ్చట్లు..

ఇంత గ్యాప్ తరువాత ఒప్పుకున్నారు?: మంచి కథ, రవితేజతో నటించడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. సినిమాలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంది. చాలా లేయర్స్‌తో కూడుకున్న కాంప్లికేటెడ్ క్యారెక్టర్. పెర్ఫామెన్స్‌కు మంచి స్కోప్ వున్న చిత్రమే కాదు, కమర్షియల్ విలువలున్న చిత్రం. అందుకే..
బాలీవుడ్‌లో ఎంట్రీ..?: ‘జులాయి’ చేస్తున్నపుడు బాలీవుడ్‌లో బర్ఫీ చేసే అవకాశం వచ్చింది. ఆ స్టోరీ గురించి త్రివిక్రమ్‌కు చెప్పాను. తప్పకుండా చెయ్ అన్నారు. అప్పుడు సరేనన్నాను. సినిమా సక్సెస్ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఇక్కడ సినిమా చేయడానికి వీలుకాలేదు. నేను తెలుగులో సినిమా చేయడానికి ఇష్టపడటంలేదంటూ వార్తలొచ్చాయి. ఇక్కడ ఆరేళ్లపాటు సినిమా చేసిన నేను ఎందుకు సినిమాలు చేయను? అని ఎవరూ ఆలోచించలేదు.
ప్రాధాన్యత పెరిగింది..: కెరీర్ ప్రారంభంలో మంచి కథ అనిపిస్తే ఎక్కువ ఆలోచించకుండా చేసే దాన్ని. అలా నెమ్మదిగా వర్క్‌పట్ల ఫ్యాషన్ క్రియేటైంది. కథల ఎంపిక మారింది. ఈ ప్రయాణంలో తప్పొప్పులు జరిగి ఉండొచ్చు. అయితే తప్పు చేశానని ఫీల్ కావడంలేదు. ఎందుకంటే నేను నా ప్రయాణాన్ని ఇష్టపడుతున్నాను.
తెలుగులో డబ్బింగ్..: తెలుగులో డబ్బింగ్ మొదటిసారి చెప్పా. అందుకు కారణం దర్శకుడు శ్రీను వైట్ల. ముందు సినిమా ఒప్పుకున్న తర్వాత మీరే డబ్బింగ్ చెప్పాలన్నారు. నేను వద్దన్నాను. కానీ నిర్మాతలు నన్ను కన్విన్స్ చేశారు. డబ్బింగ్ చెప్పే సమయంలో నేను డబ్బింగ్ చెప్పలేనేమోనని భయపడ్డాను. కానీ దర్శకుడు, పప్పు నాకు సపోర్టుగా నిలిచారు.
గ్లామర్‌ను వీడను?: గ్లామరస్ రోల్స్ చేయను, పెర్‌ఫార్మెన్స్ రోల్సే చేస్తానంటే కుదరదు. గ్లామరస్ రోల్స్‌లోనూ పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉంటుంది. అలాంటి పాత్రనే అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో చేశాను.
పెళ్లి గురించి..?: నా వ్యక్తిగత విషయాలు చెప్పాలనుకోవడంలేదు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేశాను. నేను ఎంత సినిమాల్లో నటించినా.. నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అందులో ప్రతి విషయాన్నీ అందరికీ చెప్పాలనేం లేదు కదా.
మీటూపై..: అది స్ర్తి కావచ్చు.. పురుషుడైనా కావచ్చు- లైంగిక వేధింపులను భరించిన వ్యక్తి ధైర్యంగా ముందుకు రావడం మంచి విషయం. ఓ భయానక అనుభవం. ఎవరో ఒకరు ముందుకొస్తేనే ఇలాంటి సమస్యలు తీరుతాయి. ఇలాంటి సమస్యపై నేను స్పందించాల్సిన సమయంలో ఖచ్చితంగా స్పందిస్తాను.
తదుపరి ప్రాజెక్టులు..?: కొన్ని చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే తెలియజేస్తా.

-శ్రీనివాస్ ఆర్.రావ్