ఐయామ్ ...సో లక్కీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్‌దేవరకొండ హీరోగా రాహుల్‌సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సీవాలా చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది తెలుగమ్మాయి ప్రియాంక. ఈ చిత్రం ఈనెల 17న విడుదలవుతున్న సందర్భంగా ప్రియాంక చెప్పిన ముచ్చట్లు..

నేను మరాఠి అమ్మాయిని. బిటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లమో చేస్తున్నపుడు సినిమాలపై ఆసక్తి పెరిగింది. పొసెసివ్ అనే షార్ట్ఫిలిమ్‌తో మంచి పేరు తెచ్చుకున్నాక, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తీసే సినిమా కోసం హీరోయిన్‌ను అనే్వషణ జరుగుతుందని తెలుసుకుని ఫొటోలు పంపించా. వాళ్లు ఆడిషన్‌కు పిలిచారు. టాక్సీవాలా చిత్రానికి హీరోయిన్‌గా ఎంపిక చేయడం మరచిపోలేని అనుభూతి. విజయ్ దేవరకొండ సరసన నటించడం లక్కీగా ఫీలవుతున్నా. నా లైఫ్‌లో ఇది నిజంగా లక్కీ ఛాన్స్. విజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. తను చాలా సపోర్టివ్. ఎంతగానో ఎంకరేజ్ చేశాడు. సినిమాలో నేను జూనియర్ డాక్టర్‌ని. చాలా తెలివైన అమ్మాయి, ఉత్సాహంగా ఉండే తరహా పాత్ర. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్‌లో అవకాశం రావడమే గొప్ప విషయం. ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చిందని మా ఇంట్లో మూడు వారాల తర్వాత చెప్పాను. ఎందుకంటే అవకాశం వచ్చింది కానీ అది కన్‌ఫర్మ్ అవుతుందా లేదా అన్న డౌట్ ఉండేది. మా ఇంట్లో ఈ విషయం తెలిసి చాలా ఆనందపడ్డారు. తెలుగమ్మాయిలా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ విడుదల సందర్భంగా అల్లు అర్జున్ నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడిన మాటలు మరిచిపోలేను. ఆయనతో కూడా నటించాలన్న కోరిక కలిగింది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలన్న కోరికతో తెలుగు కూడా నేర్చుకున్నా. అన్ని తరహా పాత్రలు చేస్తా. నేను ఫలానా పాత్రలే చేస్తానని చెప్పను. నెక్స్ట్ సినిమా గురించి అప్పుడే ఆలోచించలేదు.