భారతీయుడు 2లో శింబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమల్‌హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్‌ల కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకుడు శంకర్ భారతీయుడు సీక్వెల్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక కీలక పాత్రలో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ యువ తమిళ నటుడు శింబు కూడా భారతీయుడు-2లో ఓ కీలక పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. శింబు ఈ సినిమాలో పోలీసు ఆఫీసర్‌గా కనిపిస్తాడట. అయితే చిత్ర బృందంనుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.