శేఖర్ కమ్ముల కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేయబోయే కొత్త సినిమా మొదలైంది. గతంలో తన సినిమాల ద్వారా ఎంతోమంది హీరో హీరోయిన్లను పరిచయం చేసిన శేఖర్ కమ్ముల తన తర్వాతి సినిమాలో కూడా అంతా కొత్తవాళ్లనే నటింపజేయనున్నాడు. రొమాంటిక్ మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు, క్లాప్‌బోర్డు కార్యక్రమాలు సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ములతోపాటు నిర్మాతలు సునీల్ నారంగ్, రామ్మోహన్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, భరత్ నారంగ్, సదానంద్ పాల్గొన్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తిచేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో మొదలుకానుంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ గ్రూప్ నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. నటీనటులు, మిగతా సాంకేతిక నిపుణుల వివరాలుల త్వరలో తెలియజేస్తారు. అమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కబోయే ఈ ప్రేమకథకు నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్, రచన, దర్శకత్వం:శేఖర్ కమ్ముల.