నేనే టార్గెట్ కాకపోవచ్చు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పైరసీ ఎఫెక్ట్ -మా సినిమాపైనే కాదు, ఏ సినిమా పైనైనా తీవ్రంగానే ఉంటుంది. పైరసీ కారణంగా ఆడియెన్స్ థియేటర్లకు వస్తారా? రారా? అన్న టెన్షన్‌కు గురవుతాం. అంతెందుకు పెళ్లిచూపులు చిత్రం పైరసీకి గురైవుంటే, తరువాత నాకు సినిమాలు పడుండేవి కావు. ఇంతదూరం వచ్చే వాడ్నీ కాదు. ఏమైనా పైరసీని బ్యాన్ చేయాలి అంటున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. గీత గోవిందంతో సూపర్‌హిట్ అందుకున్న విజయ్ తాజాగా టాక్సీవాలాగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. జిఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్‌కెఎన్ నిర్మిస్తోన్న టాక్సీవాలా 17న విడుదల కాబోతున్న సందర్భంగా విజయ్‌తో ఇంటర్వ్యూ.

ఆడియో ఫంక్షన్‌లో అందరిగురించి మాట్లాడారు?
-ఔను, ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రభావితం చేశారు అనేదానికంటే.. సినిమాకోసం వాళ్ళు ప్రాణం పెట్టారు. అయినా నేను టెక్నీషిన్ల గురించి చెప్పడానికి ప్రధాన కారణం సినిమా కోసం వాళ్లెంత కష్టపడ్డారో, పైరసీకి గురైతే ఎంత వేదన అనుభవించారో అందరికీ తెలియాలనే. అప్పుడే మా బాధ ఆడియన్స్‌కి అర్థమవుతుందని అలా మాట్లాడా.
గీత గోవిందంపై పైరసీ ఎఫెక్టు లేదుగా?
-నిజమే. కానీ అన్ని సినిమాలకి అలాగే జరగాలని లేదుగా. పైరసీ ఎఫెక్ట్‌తో ఆడియన్స్ థియేటర్లకు వస్తారా? రారా? అన్న టెన్షన్స్ ఉంటాయి. పెళ్లిచూపులు చిత్రం పైరసీకి గురైవుంటే, ఆ తరువాత నాకు సినిమాలు వచ్చి ఉండేవి కావు. ఏమైనా పోర్న్ సైట్లను బ్యాన్ చేసినట్టే, పైరేటెడ్ సైట్లనూ బ్యాన్ చేయాలి.
మీ సినిమాలే ఎందుకవుతున్నాయ్?
-అది నాక్కూడా అర్థంకావడం లేదు. అయితే, ఎవరో కావాలనే నా సినిమాలను పైరసీ చేస్తున్నారని అనుకోవడంలేదు. పైరసీ అనేది పోస్ట్ ప్రొడక్షన్ టైంలో టీమ్‌లోవున్న వ్యక్తికే అవకాశం ఉంటుంది. గీత గోవిందం కూడా అలాగే పైరసీ అయ్యింది. ఏమైనా ఒక సినిమాని పైరసీ చేస్తే.. ఆ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరి లైఫ్‌తో ఆడుకున్నట్లే.
కంట్రోల్ చెయ్యడమెలా?
అసలు ఎవరు చేస్తున్నారో తెలిస్తే కదా, కంట్రోల్ చేయడానికి, వాళ్లమీద యాక్షన్ తీసుకోవడానికి. పైరసీ వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. వాటిని బ్యాన్ చేస్తే అన్నీ సర్దుకుంటాయి.
టాక్సీవాలా గురించి?
-అంచనాలు బాగానే ఉన్నాయంటున్నారు కానీ, నేను వీటిని అస్సలు నమ్మను. ఎవరైనా సినిమా బాగుంటేనే చూస్తారు. నేనూ అదే నమ్ముతా. కానీ చాలామంది -నీ సినిమాలపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని నాతోనూ అంటున్నారు. వాటిని సీరియస్‌గా తీసుకోను.
హైలెట్స్ ఏమిటి?
-కథ, కథనం, మ్యూజిక్, ఫొటోగ్రఫీలాంటి అంశాలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు రాహుల్ అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే ఎస్‌కెఎన్ నిర్మాతగా ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటాడు.
నోటా రిజల్ట్ గురించి?
-నోటా విడుదలకు ముందురోజే ఆ సినిమా చూశాను. నాకు అప్పుడే సినిమాలో కొన్ని మార్పులు చేస్తే బెటర్ అనిపించింది. కానీ రేపు విడుదల పెట్టుకొని, ఈరోజు ఏంచేయలేం కదా. నాక్కూడా ఏదో చేయాలని ఉంటుంది. ఒక్కోసారి వర్కవుట్ అవుతుంది, ఇంకోసారి కాదు.
టాక్సీవాలాకు ఎక్కువ టైం పట్టింది?
-పెళ్లిచూపులు తరువాత ఒప్పుకున్న సినిమా ఇదే. గీతగోవిందం, తరువాత నోటా విడుదల కోసం ఆగాల్సి వచ్చింది. నేను ఆ కథ విన్నపుడే చాలా బాగా ఎంజాయ్ చేశాను. కథ చెబుతున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. ఆ నమ్మకంతోనే చెబుతున్నాను, సినిమా ఖచ్చితంగా హిట్టవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ చక్కగా వచ్చి చూడొచ్చు.
హర్రర్ జోనరా?
-హర్రర్ కాదు. అలాగని థ్రిల్లరూ కాదు. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అలాగే హర్రర్ ఎలిమెంట్సూ ఉంటాయి. సినిమాలో క్యారెక్టర్లు పడే ఇబ్బందులకు, చేసే పనులకు నవ్వొస్తుంది.
ఆడియో ఫంక్షన్‌లో బన్నీ చాలా పొగిడాడు?
-నిజంగా నేనువాటిని వీలైనంత త్వరగా మర్చిపోడానికి ట్రై చేస్తున్నా. బన్నీ, చిరంజీవి నాగురించి మాట్లాడటం వాళ్ళ గొప్పతనం. అంతటి స్టార్లు నా గురించి అలా మాట్లాడటం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నాకు యాభై ఏళ్లు వచ్చాక నాగురించి వాళ్లు మాట్లాడినవి పెట్టుకొని చూస్తూ ఎంజాయ్ చెయ్యాలని ఉంది.
కొత్త డైరెక్టర్స్‌తో వరుస సినిమాలు?
-నాకు కథ నచ్చితే, ఆ సినిమానే చేస్తూ వచ్చాను. అయితే నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఓ పెద్ద డైరెక్టర్‌తోనే సినిమా చేస్తున్నాను. ఆయన ఎవరో ఇపుడు చెప్పలేను గాని, ఆయన సినిమాలకి మాత్రం నేను పెద్ద అభిమానిని. అలాంటి ఆయనే నాతో ఓ సినిమా చేస్తావా? అని అడగటం నేను ఎప్పటికీ మర్చిపోలేను.
తదుపరి చిత్రాలు?
-ప్రస్తుతం డియర్ కామ్రేడ్ జరుగుతుంది. ఈనెల చివరిలో మరో షెడ్యూల్ మొదలవుతుంది. ఇప్పటిదాకా ముప్ఫైశాతం పూర్తయింది. దాంతోపాటు మరో ప్రాజెక్టూ ఉంది.

-శ్రీనివాస్ ఆర్.రావ్