నయనతార గుడ్ ఈవెనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో విజయవంతమైన నంబేండా చిత్రాన్ని తెలుగులో గుడ్ ఈవెనింగ్‌గా భద్రకాళి ఫిలిమ్స్ పతాకంపై అనువాదం చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు ఎ.జగదీష్. భద్రకాళిప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం గూర్చి ఆయన మాట్లాడుతూ, కథానాయికను తన ప్రేమలో పడేయడానికి హీరో పడే అష్టకష్టాలు చివరికి ఆమెను ఒప్పించడం లాంటి కథాకథనంతో సినిమా ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని, ఓ పది రోజులపాటు తాను జైలులో ఉన్నానని, హీరోయిన్ చెప్పడంతో కథ కొత్త మలుపు తీసుకుంటుందని, ఆమె జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఫ్లాష్‌బ్యాక్‌లో ఉన్న భయంకరమైన నిజాలు ఏంటి? చివరికి ప్రేమను సాధించేందుకు హీరో హీరోయిన్లు ఏం చేశారు? అనే అంశాలతో కామెడీ లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తమిళంలో సూపర్‌హిట్ కొట్టిందని తెలిపారు. సంతానం కామెడీ హైలెట్‌గా సాగే ఈ చిత్రాన్ని త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. కరుణాకరన్, షాయాజీషిండే తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: వెనె్నలకంటి, పాటలు: చంద్రబోస్, శివగణేష్, సంగీతం: హేరిస్ జైరాజ్, కెమెరా: బాలసుబ్రహ్మణ్యం, నిర్మాత: భద్రకాళి ప్రసాద్, దర్శకత్వం: జగదీష్ ఎ.