మహానగరంలో మహర్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న ‘మహర్షి’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈమధ్యే అమెరికాలో షెడ్యూల్ పూర్తి చేసిన టీమ్, కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. వచ్చిన తర్వాత బ్రేక్ తీసుకోకుండా అన్నపూర్ణా స్టూడియోస్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో షూటింగ్ మొదలెట్టింది. దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాకు కీలకమైన ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను ప్రస్తుతం మహేష్, ఇతర కీలక ఆర్టిస్టులపై చిత్రీకరిస్తున్నాడని సమాచారం. షెడ్యూల్‌కి మరో షెడ్యూల్‌కి మధ్యలో పెద్దగా గ్యాప్ లేకుండా వంశీ పైడిపల్లి చక్కటి ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. హైదరాబాద్ షెడ్యూల్ పూరె్తైన తర్వాత మళ్లీ మరోసారి అమెరికా షెడ్యూల్ ఉంది. ఈ సినిమాలో మహేష్‌బాబు రొటీన్‌కి భిన్నంగా పలు గెటప్స్‌లో కనిపిస్తాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాలేజీ స్టూడెంట్ లుక్.. సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ లుక్‌లు బయటికొచ్చాయి. ఇక ఇతర లుక్స్ ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో మొదలైంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో మహేష్ ఫ్రెండ్‌గా అల్లరి నరేష్ కీలక పాత్ర చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. దిల్‌రాజు, అశ్వినీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.