మోక్షజ్ఞ ఎంట్రీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాదిలో ఉంటుందదన్నది చాలా రోజులుగా హల్‌చల్ చేస్తున్న న్యూస్. బాలయ్య ఎన్నో కథలను విన్నాడని కొన్నింటిని సెలక్ట్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంటుందనుకున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఏడాది ముగుస్తున్నా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య ప్రస్తుతానికి ఆలోచించడంలేదని తెలుస్తోంది. అయితే మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం మరోవైపు జరుగుతున్నట్లుగా టాక్. మోక్షజ్ఞ కోసం వినాయక్, క్రిష్, బోయపాటి వంటి దర్శకుల పేర్లు పరిశీలిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. తాజాగా ఈ జాబితాలో పూరి జగన్నాథ్ కూడా చేరినట్టు సమాచారం. ఈమధ్యకాలంలో పూరికి హిట్లు లేవు. అయతే అతని ఖాతాలో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లు లేకపోలేదు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ను చిరుత చిత్రంతో పరిచయం చేశాడు. అందుకే మోక్షజ్ఞ బాధ్యతను పూరికి ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ ఎన్బీకే బృందం చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పూరికే ఎక్కువ ఛాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం.